గ్రామాల్లోకి సర్వేయర్లను రానీయకుండా అడ్డుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రైతులకు పిలుపిచ్చారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం మాలకొండాపురం వద్ద బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తూ నిమ్జ్ రైతులు, కూలీల సదస్సు సోమవారం జరిగింది. సయ్యద్ హానీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మధు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. '2013 జిఒ ప్రకారం భూమిని తీసుకోవాలంటే నష్ట పరిహారం చెల్లించి సర్వే చేయాలి. గ్రామ సభలు పెట్టాలి. 80 శాతం మంది మెజారిటి ఆమోదం పొందాలి. ఆ తరువాత పనులు చేపట్టాలి. అందుకు భిన్నంగా ఎనిమిది మందితో మాత్రమే ఆమోదించి భూమి లాగేసుకున్నారు. ఇది తీవ్రమైన అన్యాయం. రాష్ట్రంలో ప్రజలను దిక్కులేని వారిగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.