సింగపూర్‌ మాస్టర్‌ప్లాన్‌ నమూనాల దహనం

సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ సమూ లంగా మార్చాలని, వ్యవ సాయ పరిరక్షణ జోన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని CRDA కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. మాస్టర్‌ప్లాన్‌ నమూనాలను రైతులు, నాయకులు దహనం చేశారు. వ్యవసాయ జోన్ల పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు సిఆర్‌డిఎ ఉరి తాడు బిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్‌డిఎ చైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. పారిశ్రామిక వేత్తలు, అధికార పార్టీ నాయకులతో సహా అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో మాస్టర్‌ప్లాన్‌ తిరస్కరిస్తున్నారని, స్వదేశీ నిపుణులతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని డిమాండ్‌ చేశారు. మాస్టర్‌ప్లాన్‌ అభ్యంరాలను సింగపూర్‌ సుర్బాన కంపెనీకి నివేదిక అందించామని మంత్రి నారాయణ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. సింగపూర్‌ను పరిరక్షించే విధంగా వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఉన్నాయని, వ్యవసాయాన్ని పరిరక్షించడానికి కాదని తెలిపారు.