యూనివర్శిటీలను కబేళాలుగా..

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలను మానవ కబేళాలుగా మార్చేందుకు కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రయత్నిస్తున్నదని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) విమర్శించింది. ఇటీవలి కాలంలో ఒకదాని తరువాత ఒకటిగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిణామాలపై ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయంలో రోహిత్‌ ఆత్మహత్య చిచ్చు చల్లారకముందే మరో యువ మేథావి ప్రాణాలు తీసుకోవటం వంటిప రిణామాలను పరిశీలిస్తే దేశంలోని విశ్వవిద్యాలయాలు విద్యార్ధులు, యువ మేధావుల కబేళాలుగా మారుతున్నాయన్న భావన కలుగక మానదని ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది.