రైల్వేలో ప్రైవేట్‌కు పెద్దపీట..

భారత్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు పన్నుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం దావోస్‌ వేదికపై నుంచి ప్రకటించారు. దేశంలో సులభ వ్యాపారానికి, పెట్టుబడులకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసేందుకు పన్నుల విధానాన్ని సంస్కరిస్తామని ఆయన విదేశీ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. రైల్వే రంగంలో ప్రైవేట్‌కు పెద్ద పీట వేస్తామని, అన్ని రంగాల్లోనూ ఎఫ్‌డిఐలకు ప్రాధాన్యతనిస్తామని రాయితీల వర్షం కురిపించారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థ్ధిక ఫోరం (డబ్ల్యుఇఎఫ్‌) సదస్సుకు హాజరైన జైట్లీ ఈ సందర్భంగా సిఐఐ, కన్సల్టెన్సీ బిసిజిలు సంయుక్తగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.