
స్వచ్ఛమైన విద్యుత్‌ను అందించటంతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)పై మెరుగైన నియంత్రణ, రంగంలోకి వేగంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన కొత్త విద్యుత్ టారిఫ్ విధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. స్వచ్ఛమైన విద్యుత్, డిస్కంలపై మెరుగైన నియంత్రణతో పాటు స్వచ్ఛబారత్ కార్యక్రమానికి మద్దతుగా రూపొందించిన విద్యుత్ టారిఫ్ విధానానికి కేబినెట్ ఆమోదం లభించిందని కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వవర్గాలు వివరించాయి.