
దేశంలో అమలవుతున్న విద్యా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ, విద్యార్థి సమస్యలపై గలమెత్తే భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) 15వ అఖిల భారత మహాసభలు శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రాజస్థాన్‌లోని సికార్‌లో జరుగనున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ చరిత్రలోనే రాజస్థాన్‌లో తొలిసారిగా ఈ సభలు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు నితీష్ నారాయణ్ ప్రజాశక్తికి వివరించారు.సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేతులు మీదుగా ప్రారంభం కాబోయే బహిరంగ సభకు ముందు పదివేల మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు.