డీజిల్‌ ధర తగ్గించాలని డిమాండ్‌ జనవరి 22న నిరసనలు

డీజిల్‌ రేట్లు తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 22న నిరసన కార్యక్రమాలు చేపట్టి, మార్చి 1న చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన్నట్లు ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన ్‌(ఎఐఆర్‌టి డబ్ల్యూఎఫ్‌) తెలిపింది. కోల్‌కతాలో శని, ఆదివారాలు జరిగిన ఫెడరేషన్‌ జాతీయ కార్యవర్గ సమావేశాలను సమాఖ్య ప్రధాన కార్యదర్శి కెకె దివాకర్‌ మీడియాకు విడుదల చేశారు. డిజిల్‌ ధర ఏడాది కాలంలో ఆరు సార్లు లీటరుకు రూ.23లు అదనంగా పెంచారని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌కె జిలానీ, సిహెచ్‌ సుందరరావు ప్రకటించారు.