పాక్ విష్యంలో మోడీ వైఖరేంటి?:ఏచూరి

పాకిస్తాన్‌తో చర్చల విషయంలో మోడీ ప్రభుత్వం కుప్పిగంతులు వేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం చర్చల నుంచి వెనక్కి పోయిందని, ఆ తర్వాత అప్ఘనిస్తాన్‌ నుంచి తిరుగు ప్రయాణం సందర్భంగా ప్రధాని మోడీ ఆకస్మికంగా పాకిస్తాన్‌లో దిగారని గుర్తుచేశారు. పఠాన్‌కోట్‌ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం చర్చల విషయంలో ఎలాంటి వైఖరిని అను సరించబోతున్నారని మోడీని ప్రశ్నించారు. ఇలాంటి విదేశాంగ విధానం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు.