2015

తిరుపతి లో ముంపు ప్రాంతాల బాదితులకు సిపిఎం అనధానం

చిత్తూర్ జిల్లా తిరుపతి లో అడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ముంపుకు గురి ఐన  ప్రాంతాలను సిపి యం జిల్లా కార్యదర్శి కె. కుమార్ రెడ్డి , వ్యసయకర్మిక సంగం జిల్లా కార్య దర్శి వి. నాగరాజు , యం యల్ సి  యండ్లపల్లి శ్రీనివాసుల రెడ్డి, సిపి యం నగర   కార్యదర్శి టి . సుబ్రమణ్యం, డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఎస్. జయచంద్ర సి ఐ టి యు నగర కార్యదర్శి  ఎన్. చంద్ర శేకర్ రెడ్డి, సి పి , సి పి ఎం నాయకురాలు ఆర్ . లక్ష్మి  గురువారం పర్యటించి బాదితులకు ప్రభుత్వం నుంచి త్వరగా సహాయం అందేలా చేస్తామని హామీ ఇచారు .  అంతరం బాదితులకు భోజనం అందించారు. ఈ కార్యకరమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.

TDP ఎంపి శివప్రసాద్‌ భూకబ్జా..

తిరుపతి శివారు ప్రాంతంలో 20 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ కబ్జాకు పాల్పడ్డారని వామపక్షాల నేతలు తెలిపారు. అధికారం ఉందన్న గర్వంతో పేదలకు పట్టాలిచ్చిన భూముల్లో ఎంపి పాగా వేయించారని.. తక్షణం ఆక్రమణను ఆపాలని డిమాండ్‌ చేశారు.

ఉగ్రవాదానికి అమెరికానే కీలకం..

జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా పాశ్చాత్య దేశాలపై మండిపడ్డారు.ఉగ్రవాదం పెంచి పోషించింది మీరే. ఇప్పుడు ఎందుకు అరుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు? అమెరికా సహా పాశ్చాత్య దేశాలే నేటి ఉగ్రవాదానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు దాడులు ఎదుర్కోవాల్సి వచ్చే సరికి మీరే గగ్గోలు పెడుతున్నారు. ముస్లింలు ఉగ్రవాదులు కాదు. అమెరికా, బ్రిటన్‌ ఉగ్రవాదాని పెంచి పోషించాయి. ఇప్పుడు వారే దాని ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తాము సృష్టించిన వారి నుంచే ఇప్పుడు ముప్పు ఎదురైతే అరచి శోకండాలు పెడుతున్నారన్నారు. 

ఓట్లడిగేహక్కు బాబుకు లేదు..

కల్వకుర్తి ప్రాజెక్టుపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ఓట్లడిగే హక్కు కోల్పోయారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు తనకు రెండు కళ్ళుగా పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారని తెలిపారు. వలసలతో గోస పడుతున్న మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలకు సాగునీరందించే ఉద్ధేశ్యంతో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. 

వారు ముస్లింలైతే మోడీ తీరేవేరు

ఛోటారాజన్‌, ఉల్ఫా నేత అనూప్‌ ఛేతియాపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షకీల్‌ అహ్మద్‌ ట్విట్ట ర్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 'ఛోటారాజన్‌, అనుప్‌ ఛెటి యా ముస్లిం కాకపోవటం వారి అదృ ష్టం, వారు ముస్లింలు అయితే మోడీ సర్కారు వారితో అనుసరించే తీరు వేరుగా వుండేది' అంటూ ట్విట్టర్‌లో ఆయన చేసిన వ్యాఖ్య లపై బిజెపి మండిపడింది. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో వాటిపై అహ్మద్‌ వివరణిస్తూ ఉగ్రవాదంపై బిజెపి అనుసరిస్తున్న 'రెండు నాల్కల ధోరణి, ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టేందుకే తానీ వ్యాఖ్యలు చేశానన్నారు.

ప్రత్యేక సీమతో లాభంలేదు:సిపిఐ

ప్రత్యేక సీమ ఉద్యమంతో నష్టమే తప్ప లాభం లేదని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అధికారం కోల్పోయాక విభజనవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో డిసెంబర్‌ 7న నిరసన తెలుపనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.

కేరళలో LDF ఘనవిజయం..

కేరళలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ఆరు కార్పొరేషన్లకు ఐదు కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ కేవలం కోచి కార్పొరేషన్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఆరు కార్పొరే షన్ల మేయర్లలో ముగ్గురు మహిళలు. తిరువనంతపురం, కొల్లాం, త్రిస్పూర్‌, కొజికోడ్‌, కన్నూర్‌ కార్పొరేషన్లలో ప్రతిపక్ష వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) అధికారంలోకి వచ్చింది.

ముస్లింలు పోర్క్‌ తిన్నప్పుడే:రాయ్

ముస్లింలు బహిరంగంగా పోర్క్‌ తిన్నప్పుడే అసహన వ్యతిరేక ఉద్యమానికి సమతుల్యత ఉంటుందని  బిజెపి బెంగాల్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు తథాగత్‌ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆ రోజును అసహనానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైన ట్టు తాము భావిస్తామని రారు ఒక జాతీయ పత్రికకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యా నించారు. లౌకిక, ప్రజాతంత్ర వాదులు చెప్పేది ప్రజలు ఏం తినాలనుకుంటే అది తిననివ్వాలన్నది. దానికి విరుద్ధంగా మతతత్వ వాదులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.

ఇదో అసహనయుగం..

'ప్రతి ఒక్కరూ ప్రతి అంశాన్ని భిన్నమైన రీతిలో ఆలోచిస్తున్నారు. ఇది అసహన యుగంగా మారిపోయింది' అంటూ ముంబయి హైకోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడి హాజీఆలీ దర్గాలో మహిళల ప్రవేశాన్ని నిషేధించటాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్య పిటిషన్‌ను విచారణకు చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 

దిగొచ్చిన ప్రభుత్వం

బందరుపోర్టు, పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లోనే నిర్మించాలని కోరుతూ కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్‌ మండలంలో శనివారం జరిగిన 'మీ ఇంటికి...మీ భూమి కార్యక్రమంలో అరెస్ట్‌ చేసిన భూపరిరక్షణ కమిటీ కన్వీనర్‌ కొడాలి శర్మ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చౌటపల్లి రవి, పోతేపల్లి ఎంపిటిసి పిప్పళ్ళ నాగేంద్రబాబులు బెయిల్‌పై మచిలీపట్నం స్పెషల్‌ సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. ఎక్సైజ్‌ శాఖ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై అరెస్టయి రిమాండ్‌లో ఉన్న కృష్ణాజిల్లా బందరు మాజీ శాసనసభ్యులు, వైసిపి నాయకుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)కి బుధవారం బెయిల్‌ లభించింది.

Pages

Subscribe to RSS - 2015