2015

కాంగ్రెస్‌తో పొత్తుకు BJP రెడీ

అగర్తలా : రాబోయే పౌర సంస్థల ఎన్నికల్లో పాలక వామపక్ష సంఘటనను ఓడించేందుకు ఎన్నికల పొత్తు పెట్టుకుందామంటూ త్రిపురలో బిజెపి, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను అభ్యర్థించింది. ఇదొక ఆశ్చర్యకరమైన పరిణామమే. వామపక్షాల అభ్యర్థులను ఓడించాలంటే ప్రతిపక్ష పార్టీల ఓట్లన్నింటినీ కలిపితేనే సాధ్యమవుతుందని బిజెపి భావిస్తోంది.

SFI మహాసభల లోగో..

ఎస్‌ఎఫ్‌ఐ 15వ అఖిల భారత మహాసభల లోగోను తయారు చేసి పంపాలని దేశంలో ఉండే చిత్ర లేఖనం అభిమానులకు ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ ఆహ్వానించింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని సికార్‌లో జనవరి 22నుంచి25వరకు ఈ మహాసభలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వి.శివదాసన్‌, రితోబ్రతో బెనార్జీ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేశారు.

FDIలు కొల్లగొట్టడానికే:ఏచూరి

భారత మార్కెట్‌ను కొల్లగొట్టడానికే విదేశీ పెట్టుబడులకు ప్రధాని ఆహ్వానిస్తున్నారని సిపిఎం పేర్కొంది. పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడానికే ప్రభుత్వం ఎఫ్‌డిఐలకు లైసెన్స్‌ ఇచ్చిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో దేశంలోని పేదలకు దినసరి జీవనం గడవడమే గగనమైందని, ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

18మాసాల్లో ఆశలు ఆవిరి..

హైదరాబాద్‌: ఏడాదిన్నర పాలనలో తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయి ఆశలు ఆవిర వుతున్నాయని కవులు, కళాకారులంతా దిక్కులు పిక్కటిల్లేలా తిరుగుబాటు గానాన్ని వినిపించాలని కళాకారుల జేఏసీ తిరుగుబాటు పాట సమావేశం పిలుపునిచ్చింది. ఈ ‘తిరుగుబాటు పాట’ తెలంగాణలో మరో ఉద్యమం కావాలని కవులు, కళాకారులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజా తెలంగాణను తేవాలని పిలుపునిచ్చింది. సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సామ్రాజ్యవాదానికి, మతోన్మాదానికి, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు.

మోదీ గద్దెదిగితేనే భారత్,పాక్‌చర్చలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ మంగళవారం మరో వివాదానికి తెరతీశారు. ప్రధాని మోదీని గద్దె దింపితేనే భారత, పాకిస్థాన్‌ల మధ్య చర్చలు ప్రారంభమవుతాయంటూ పాకిస్థాన్‌కు చెందిన దునియా టీవీ చానెల్‌ చర్చా కార్యక్రమంలోనే వ్యాఖ్యానించి మరో దుమారం రేపారు. భారత, పాక్‌ల చర్చలు తిరిగి ప్రారంభం కావడానికి ఏం చేయాలంటూ పాక్‌ టీవీ చానెల్‌ వ్యాఖ్యాత ప్రశ్నకు అయ్యర్‌ స్పందిస్తూ.. ‘‘అన్నింటి కంటే ముందుగా మోదీని తొలగించాలి.ఇరుదేశాల సంబంధాలు మెరుగయ్యేందుకు ఇంతకుమించి మార్గం లేదు అని అన్నారు.

DEC 27నుంచి సీపీఎం ప్లీనమ్..

సీపీఎం ప్లీనమ్ సమావేశాలకు వేదిక ఖరారైంది. డిసెంబర్ 27 నుంచి 31 వరకు కోల్‌కతాలో సమావేశాలు జరపాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణే లక్ష్యంగా కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్‌ పెరేడ్‌ మైదానంలో భారీ ర్యాలీకి కూడా పార్టీ అగ్రనేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.

ముగిసిన 4రోజులCPMసమావేశాలు

ఢిల్లీలో 4 నాలుగు రోజుల పాటు సుదీర్ఘం సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, దేశంలో నెలకొన్న సమస్యలపై కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి.  ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం ఎలా చేయాలి, ఎల్డీ ఎఫ్ ను బలోపేతం చేసేందుకు కావల్సిన మార్గదర్శకాలను చర్చించడం జరిగిందని పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు తెలిపారు. ఈ అంశాలను ప్రతి రాష్ట్ర కమిటి చర్చించిన తరువాత కోల్ కతాలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

ఆర్థిక పతనం..

విదేశీ పెట్టుబడుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని విదేశాలు తిరుగుతుంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వార్షిక వినిమయ ద్రవ్యోల్బణం వరుసగా మూడో మాసం పెరిగి అక్టోబర్‌లో 5.0 శాతానికి చేరుకుంది. రిటైల్‌ ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగి 5.25 శాతానికి చేరింది. పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో 6.3 శాతంతో పోలిస్తే సెప్టెంబర్‌లో 3.6 శాతానికి తగ్గింది. ఇవన్నీ ప్రభుత్వం గురువారం నాడు విడుదల చేసిన లెక్కలు.

బాక్సైట్‌ తవ్వకాల జి.వో.నెం.97ను వెంటనే రద్దు చేయాలి. ట్రైబల్‌ అడ్వజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి.-సిపియం

            

బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు, ప్రజాతంత్ర వాదులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమం యొక్క తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని బాక్సైట్‌ తవ్వకాల జి.వోను వెంటనే రద్దు చేసేలా 16న జరిగే రాష్ట్ర క్యాబినేట్‌లో నిర్ణయం చేయాలని సిపియం పార్టీ డిమాండ్‌ చేస్తుంది. లేనియెడల సిపియం పార్టీ ప్రజా సంఘాలు, సంస్థలు బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడే ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని విశాల ఉద్యమానికి సన్నిద్ధం అవుతుంది.

Pages

Subscribe to RSS - 2015