18మాసాల్లో ఆశలు ఆవిరి..

హైదరాబాద్‌: ఏడాదిన్నర పాలనలో తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయి ఆశలు ఆవిర వుతున్నాయని కవులు, కళాకారులంతా దిక్కులు పిక్కటిల్లేలా తిరుగుబాటు గానాన్ని వినిపించాలని కళాకారుల జేఏసీ తిరుగుబాటు పాట సమావేశం పిలుపునిచ్చింది. ఈ ‘తిరుగుబాటు పాట’ తెలంగాణలో మరో ఉద్యమం కావాలని కవులు, కళాకారులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజా తెలంగాణను తేవాలని పిలుపునిచ్చింది. సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సామ్రాజ్యవాదానికి, మతోన్మాదానికి, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు.