
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 మే, 2026.
కడపలో మత సామరస్యాన్ని కాపాడాలి
ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఉద్రిక్తతలు సృష్టించడానికి మతోన్మాదులు చేస్తున్న ప్రయత్నాలను అదుపు చేసి మతసామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కడపలోని అల్మాస్‌పేట సర్కిల్‌ను టిప్పు సుల్తాన్ సర్కిల్‌గా అభివృద్ధి చేస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. కడప కార్పొరేషన్ కూడా ఈ విషయంపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇప్పుడు మతోన్మాద శక్తులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పరిస్థితిని ఉపయోగించుకొని ప్రజలను రెచ్చగొడుతున్నారు. తాజా పరిణామాలకు వారే బాధ్యులు. ఆ సర్కిల్ విషయంలో ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం గర్హనీయం. ముఖ్యమంత్రి హామీ, కార్పొరేషన్ తీర్మానాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు రీతిన వ్యవహరించడం అవసరం. ఉద్రిక్తతలు సడలింపజేసి కడప నగరంలో మతసామరస్యం నెలకొనేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలి. కుట్రపూరితంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించే శక్తులపట్ల కఠినంగా వ్యవహరించాలి. స్వార్థపర శక్తుల కుట్రలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
