2015

ఇక్కడ గాడ్సే అక్కడ గాంధీనా?

దేశంలో గాడ్సేను పొగిడిన ప్రధాని మోడీ..లండన్‌ పార్లమెంట్ ఆవరణలో గాంధీని పొగడటం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి విమర్శించారు. దేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న మోడీకి బీహార్‌ ఎన్నికలు చావుదెబ్బవంటివని అన్నారు. మోడీ చేస్తున్న విదేశి పర్యటనలన్నీ మన దేశంలోకి విదేశీ పెట్టుబడుదారులకు రెడ్‌ కార్పెట్‌ వేసేందుకేనని చెప్పారు.

17 నుండి అసెంబ్లీ సమావేశాలు

 శాసనసభా శీతాకాల సమావేశాలు డిసెంబరు 17 నుంచి 22 వరకు జరుగుతాయని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై చర్చించే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా, ఎజెండాలో రూపొందించిన అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు.

బ్రిటన్లో మోడీపై వ్యతిరేకత..

ప్రస్తుతం బ్రిటన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీకి ఎర్రతివాచీ పరచి స్వాగతం చెప్పటం సరికాదని, ఆ దేశంలో కొనసాగుతున్న మానవహక్కుల హననానికి నిరసనగా ఎర్రజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కెమరాన్‌ను కోరింది. ఆమ్నెస్టీ బ్రిటన్‌ విధాన నిర్ణయ విభాగం అధిపతి అల్‌ హోగార్త్‌ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భారత్‌లో స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారని, కొంతమందిపై బురద జల్లు తూ మరికొంతమందిపై నల్ల ఇంకు పూస్తూ వారిని జాతి వ్యతిరేకులుగా ఆరోపిస్తున్నారని చెప్పారు.

బాక్సైట్‌ వ్యతిరేకరిలేదీక్షలు..

విశాఖ మన్యంలోని చింతపల్లి, జర్రెల ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అత్యంత దారుణమని ఎమ్మెల్సీ, మండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎంవిఎస్‌ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను రద్దు చేయాలని పాడేరులోని ఐటీడీఏ వద్ద గిరిజన సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1/70 చట్టం ప్రకారం గిరిజన సంపదను ఇతరులు దోచుకోవడానికి వీల్లేదన్నారు.

మాస్టర్‌ప్లాన్‌పై ఇప్పటికీ సందేహమే..!!

మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కోసం గురువారం ఏర్పాటైన సదస్సులో రైతుల ప్రశ్నలకు మంత్రులుగాని, అధికారులుగాని సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో తమ భవిషత్తు ఏమిటో తెలియక రైతుల్లో అయోమయం ఏర్పడింది. సమీకరణలో భూములిచ్చిన వారికి కేటాయిస్తామన్న స్థలాలు ఇవ్వలేదు. కనీసం ఎక్కడ ఇస్తారో కూడా చెప్పటంలేదు. ఇంకా చర్చించాలంటున్నారు. ఇంతవరకు సిఆర్‌డిఎ మండల స్థాయి రికార్డుల ఆధారంగా సర్వే చేయలేదు. పూలింగులో ఇచ్చిన భూములు, రికార్డుల ప్రకారం ఉన్న భూముల వివరాల్లో ఏమైనా హెచ్చుతగ్గులుంటే ఈ సర్వేలో బయటపడతాయి. దీన్ని ఈ నెలలో చేపట్టాలని నిర్ణయించారు. గ్రామ కంఠాల సమస్యనూ పరిష్కరించలేదు.

ప్రభుత్వం దళారీ పాత్ర పోషిస్తోంది..

భూములు, వృత్తుల పరిరక్షణ కోసం రైతులు, పేదలు, చేతివృత్తిదారులు ఏకోన్ముఖంగా కదలాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. భూముల పరిరక్షణకు ఒకవైపు ప్రజాపోరాటాలు కొనసాగిస్తూనే మరోవైపు చట్టపరమైన పోరాటం కొనసాగించాల్సిన అవసరముందన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వం దళారీపాత్ర పోషిస్తోందని విమర్శించారు. ఈ ప్రాంత రైతుల భూముల రిజస్ట్రేషన్లు జరిగేలా, భూముల మార్కెట్‌ విలువ పెంచేలా చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

సమస్యలపై నిలదీస్తాం:మధు

దేశవ్యాప్తంగా, రాష్ర్టవ్యాప్తంగా కార్మిక సమస్యలపై, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు మధు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఉద్యమాలపై కేంద్ర కమిటీలో చర్చించామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యాట్ రూపంలో ప్రజలపై భారాలు మోపుతున్నారని, దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు.

జిఒ 97ను రద్దు చేయకుంటే పోరాటమే- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌ నర్సింగరావు

బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పోరాటం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌ నర్సింగరావు హెచ్చరించారు. ఆయన స్థానిక విలేకర్లతో శుక్రవారం మాట్లాడుతూ, సమతా తీర్పునకు వ్యతిరేకంగా ఎపిఎండిసికి గిరిజన భూములను అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్ట ప్రకారం ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిం చాలన్నారు. వెంటనే జిఒను రద్దు చేయకపోతే నిరవధిక పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.

భూ సేకరణపై ఐక్య పోరాటం - సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం

భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు ఐక్య పోరాటం చేయడంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యదర్శి కె.లోకనాధం పేర్కొన్నారు. ఇండిస్టీయల్‌ పార్కు (పిసిపిఐఆర్‌) పేరుట ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఇండిస్టీయల్‌ పార్కు వ్యతిరేఖ పోరాట కమిటి అధ్యక్షులు లొడగల చంద్రరావు ఆధ్వర్యంలో మూలపర్ర గ్రామంలో రైతులతో శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన లోకనాథం మాట్లాడుతూ, భూసేకరణకు వ్యతిరేఖంగా ఈ ప్రాంత రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.

Pages

Subscribe to RSS - 2015