2015

నెల్లూరులో వరద సహాయక చర్యలు

నెల్లూరులో వరద గ్రామాలలో సిపిఎం సహాయకచర్యలు చేపట్టింది. గ్రామా గ్రామాన వరదల్లో చిక్కుకున్న వారికి సహాకారం అందించడంతో పాటు ఆహారపొట్లాలను అక్కడి సిపిఎం కార్యకర్తలు పంపిణి చేస్తున్నారు ..వరదలవలన నష్టపోయినవారిని ఆదుకోవడం కోసం చేయి చేయి కలపాలని కోరుతున్నారు.

నితీష్ ప్రమాణస్వీకారానికిఏచూరి

ఈనెల 20న పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..అయితే ఈ కార్యక్రమానికి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరౌతున్నట్లు సమాచారం .

GSTపై రాహుల్ తో జైట్లీ భేటి..

GSTబిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది.. దీనికోసం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నారు.. 

టిప్పు సుల్తాన్‌ జయంతిపై సంఘ్ పరివార్‌ రగడ..

చరిత్రను సంఫ్‌ు పరివార్‌ మతోన్మాద కళ్లద్దాలతో పరిశీలిస్తే అన్నీ తల్లకిందులుగానే కనిపిస్తాయి. దేశ రక్షణ కోసం పోరాడి యుద్ధభూమిలో నేలకొరిగిన వీరుడు ముస్లిం అయితే ఆయన దేశ భక్తుడు కాదు. విదేశీయులతో కుమ్మక్కయి దేశానికి ద్రోహం చేసిన వాడు హిందువు అయితే అతను మహా దేశభక్తుడవుతాడు. ప్రస్తుతం కర్ణాటకలో టిప్పుసుల్తాన్‌ జన్మదిన వేడుకలను వ్యతిరేకిస్తూ మత ఘర్షణలు సృష్టిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి-సంఫ్‌ు పరివార్‌ శక్తుల ధోరణి చూస్తుంటే కేంద్రంలో అధికారం చేపట్టిన ఈ శక్తులు దేశాన్ని తాలిబానీకరించడానికి ఎంతగా తాపత్రయ పడుతున్నాయో అర్థమవుతుంది. 

''పాలకులే'' పీడకులైతే..

 ''పాలకులు మారినంత మాత్రాన ప్రజలకేమీ ఒరగదు. దోపిడీ వర్గాలు తమ సాంస్కతిక భావజాలాల ద్వారా ప్రజా జీవితాన్ని ప్రస్తుత దుర్భర స్థితిలోనే కొనసాగించడానికి సర్వప్రయత్నాలూ చేస్తూ ఉంటాయి. పీడితవర్గ పక్షపాత దక్పథం కలిగిన నాయకులు అధికారం చేపట్టాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది'' అని ఇటలీ తత్వవేత్త ఆంటోనియో గ్రాంసి అన్నారు. అతి పెద్ద దేశాలలో ఒకటైన మన దేశంలో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. ఒకటి రెండు రాష్ట్రాలలో తప్ప అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ పాలక ముఖ్యులు 'ముఖ్య కార్యనిర్వాహక అధికారులు'గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనే కాదు పార్టీలలోనూ ప్రజాస్వామ్యం అడుగంటింది.

ఉగ్రవాదం - అగ్రవాదం

 ఫ్రాన్స్‌ రాజధాని నగరం పారిస్‌పై శుక్రవారంనాటి ఉగ్రవాద దాడితో టర్కీలో జరుగుతున్న జి20 సమావేశం దృష్టి ప్రపంచ ఆర్థిక పరిస్థితి మీదనుండి ఉగ్రవాదం మీదికి మళ్లింది. ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు ద్వారాలు తెరిచి ఉంచే పారిస్‌ నగరంలో ఉగ్రవాదలు సృష్టించిన మారణ హోమంలో 128 మంది అమాయకులు మ్యత్యువాత పడడం, వందలాది మంది క్షతగాత్రులు కావడం దిగ్భ్రాంతికరం. ఈ దాడి తరువాత నగరం ఇప్పుడు పాత ధోరణిని కొనసాగిస్తుందా లేక శరణార్ధులకు, ఇతర జాతుల ప్రజలకు ద్వారాలు మూసేస్తుందా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లో ఇప్పుడు జరిగింది అతిపెద్ద ఘాతుకం.

రిజర్వ్‌ ఫారెస్టు స్వాహా..

 రాజధాని అభివృద్ధి పనులు చేపట్టడానికి తాడేపల్లి పురపాలక సంఘ పరిధిలోని రిజర్వు ఫారెస్టు ఏరియాని సీఆర్‌డీఏకు ఇచ్చేందుకు కౌన్సిల్‌ ఆమోదించింది. తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న రిజర్వు ఫారెస్టు ఏరియాలో 1032 నివాసాలు ఉన్నాయని, వాటన్నింటినీ క్రమబద్ధీకరణ చేయాలనీ కౌన్సిల్‌ తీర్మానించింది. అలాగే, ముఖ్యమంత్రి అతిథి గృహానికి వెళ్లే దారిలో వర్క్‌షాపు వైజంక్షన్‌ వద్ద రూ.14లక్షల 50 వేల వ్యయంతో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేయడానికి రూపొందించిన అంచనాలను ఆమోదించారు.

మోడీ పాలనలో పెరుగుతున్నఅసహనం..

మాజీ ఉప ప్రధాని, బిజెపి సీనియర్‌ నాయకులు లాల్‌కృష్ణ అద్వానీ గతంలో ఒకసారి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని గొప్ప 'ఈవెంట్‌ ఆర్గనైజర్‌'గా వర్ణించారు. ఎల్‌కె అద్వానీని బిజెపి, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) విస్మరించింది. అయినప్పటికీ దేశ ప్రజానీకం అద్వానీని, ఆయన నాయకత్వాన్నీ ఇంకా గుర్తు పెట్టుకున్నది. ప్రధాని మోడీ ప్రస్తుతం దేశాలు పర్యటించడం, విదేశీ ప్రధానులు, అధ్యక్షులు, బడా పెట్టుబడిదారులకూ ఆతిథ్యం ఇస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మోడీ దేశ ప్రజానీకానికి ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారనే విషయం కూడా నిక్కచ్చిగా చెప్పవచ్చు.

భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం..

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రైతు వ్యతిరేక భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు హెచ్చరించారు. భూ బ్యాంకు విధానానికి నిరసనగా గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో చేపట్టిన దీక్షలను పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, బాబురావు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంలో భూము లిచ్చిన రైతులకు ప్లాట్లు ఎక్కడిస్తారో ఇప్పటికీ స్పష్టం చేయ లేదని, అభివృద్ధిని కేంద్రీకరిస్తే అసమానతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రచయితలకు ప్రణబ్ సూచన ..

అసహనం గురించి జరుగుతున్న చర్చలో పలుమార్లు జోక్యం చేసుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చర్చలు, వాదనల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని రచయితలకు, సినీప్రముఖులకు పిలుపునిచ్చారు. అవార్డు అనేది ప్రతిష్టాకరమైనదని అంటూ, అది ప్రతిభకూ, పాటవానికీ ప్రజలు కట్టిన పట్టం అని ప్రణబ్‌ అన్నారు. అవార్డుల్ని అందుకునే వారు వాటి విలువను గుర్తించి, వాటిని అట్టిపెట్టుకోవాలని ఆయన అన్నారు.

Pages

Subscribe to RSS - 2015