రచయితలకు ప్రణబ్ సూచన ..

అసహనం గురించి జరుగుతున్న చర్చలో పలుమార్లు జోక్యం చేసుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చర్చలు, వాదనల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని రచయితలకు, సినీప్రముఖులకు పిలుపునిచ్చారు. అవార్డు అనేది ప్రతిష్టాకరమైనదని అంటూ, అది ప్రతిభకూ, పాటవానికీ ప్రజలు కట్టిన పట్టం అని ప్రణబ్‌ అన్నారు. అవార్డుల్ని అందుకునే వారు వాటి విలువను గుర్తించి, వాటిని అట్టిపెట్టుకోవాలని ఆయన అన్నారు.