స్వతంత్ర ఎమ్మెల్యే, ఇంజనీర్ అబ్దుల్ రషీద్‌పై విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి) కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం దాడి చేశారు. శ్రీనగర్ అసెంబ్లీ గెస్ట్ హౌస్‌లో గొడ్డుమాంసంతో విందు ఇచ్చినందుకు ఈ దాడి అని చెప్పారు. ఈ ఘటనలో రషీద్, ఆయన పీఆర్‌వోలకు గాయాలయ్యాయి. తన మద్దతుదారులతో కలసి చెనాబ్ లోయలో రషీద్ మోటారు సైకిళ్ల యాత్రను నిర్వహించారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన విహెచ్‌పి కార్యకర్తలు ఆయన్ను ఆపి, నల్లజెండాలు చూపించి, వ్యతిరేక నినాదాలు చేశారు. చూస్తుండగానే ముఖంపై సిరా పోసి, ఆయన ప్రయాణిస్తున్న స్కార్పియోపై రాళ్లతో దాడి చేశారు.