2015

మత సామరస్యం కోరుతూ కరపత్రాల పంపిణీ

ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకే ఇటీవల అస హన ధోరణులు, దాడులు పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఐ(ఎం) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భిన్నతంపై మతోన్మాద దాడులు, అసహన ధోరణు లకు నిరసనగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోనూ సిపిఎం ప్రచార యాత్ర లు నిర్వహిస్తోంది. అందులోభాగంగా బుధవారం శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు నిర్వహించారు. అసహన ధోరణులకు వ్యతిరేకంగా, మత సామరస్యం కోరుతూ సిపిఎం శ్రీకాకుళం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాయివీధిలో మతసామరస్యంపై కరపత్రాలను పంపిణీ చేశారు.

లోక్‌సభలో వామపక్షాల వాకౌట్‌..

 ఇటీవల కేంద్ర మంత్రి వీకే సింగ్‌ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో బుధవారం దుమారం రేకెత్తించాయి. మంత్రి ఇటీవల జరిగిన ఒక దళితుని కుటుంబం సజీవ దహనం సంఘటనపై మాట్లాడుతూ, వారిని కుక్కలతో పోల్చడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు కురిపించాయి. ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. ఇదే డిమాండ్‌తో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర వామపక్షాలు కూడా సభనుంచి వాకౌట్‌ చేశాయి

గుజరాత్ లో బిజెపికి ఎదురుదెబ్బ

మొన్న యుపిలో నిన్న బీహార్‌లో వరుసగా దెబ్బ మీద దెబ్బ తింటున్న బిజెపికి తాజాగా గుజరాత్‌లో మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపాల్టీల్లో గట్టెక్కినా కీలకమైన పంచాయతీల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బుధవారం వెలువడిన స్థానిక ఎన్నికల ఫలితాల్లో గ్రామీణ గుజరాత్‌లో కాంగ్రెస్‌ అత్యధిక పంచాయతీలను గెలుచుకుంది. అయితే మున్సిపల్‌ కార్పొరేషన్లలో మాత్రం బిజెపి తన పట్టును నిలుపుకుంది. మొత్తం ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లనూ అది చేజిక్కించుకుంది. జిల్లా, తాలుకా పంచాయితీల్లో మాత్రం కాంగ్రెస్‌ తన పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుచుకుంది. 

కార్మికవ్యతిరేక బిల్లు ఆమోదం

వివాదాస్పదమైన గుజరాత్‌ కార్మిక చట్టాల బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ప్రజా వినియోగ సేవల రంగాల్లో సమ్మెలను ఏడాదిపాటు నిషేధించే కార్మిక వ్యతిరేక నిబంధనలను గుజరాత్‌ ప్రభుత్వం ఈ బిల్లులో పొందుపరిచింది. గుజరాత్‌ తీవ్రవాద, సంఘటిత నేరాల నియంత్రణ (జిసిటిఓసి) బిల్లు, 2015ను కూడా దీనితో పాటే రాష్ట్రపతి వద్దకు పంపారు. ఈ రెండు బిల్లులకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని ప్రతిపక్షం నుండి విజ్ఞప్తులు రాష్ట్రపతికి అందాయి. హిందూ పత్రిక దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం ప్రకారం, సెప్టెంబరు 20నే గుజరాత్‌ కార్మిక చట్టాల (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు తేలింది. 

వామపక్షాల ఆధ్వర్యంలోడిసెంబర్‌ 1 నుండి 6 వరకు మతోన్మాద వ్యతిరేక ప్రచారం

వామపక్షాల దేశ వ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్‌ 1 నుండి 6వ తేదీ వరకు మతోన్మాదంపై వ్యతిరేక దినాలుగా పాటించాలని వామపక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. డిసెంబర్‌ 3న స్థానిక అంబేద్కర్‌సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం కొత్తపేట మల్లయ్యలింగం భవనంలో తూమాటి శివయ్య అధ్యక్షతన పలు వామపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం హిందూత్వ సిద్ధాంతంపై మరింత మొగ్గు చూపుతుందని, దీనికి ప్రతిఘటన క్రమం ప్రారంభం కావటం సానుకూల పరిణామమన్నారు. రచయితలు, మేధావులు, కళాకారులు, ఇందులో గొప్ప పాత్ర పోషించటం అభినందనీయమన్నారు.

2300 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్..

ఎపి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి లంక భూములను సేకరించడానికి సీఆర్డీఏ సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2300 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టు రైతులు 9.1 పత్రాలు ఇవ్వాలని అధికారులు తెలిపారు.

బాక్సైట్ శ్వేతపత్రం అసత్యాల పుట్ట..

గిరిజన గర్జనలో భాగంగా  నర్సీపట్నంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందకారత్  బాక్సైట్ తవ్వకాలపై  ప్రెస్మీట్ నిర్వహించారు.బాక్సైట్‌ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాల పుట్ట అని  విమర్శించారు. బాక్సైట్‌ తవ్వకాలతో వేలాది మంది గిరిజనులు నిరాశ్రయులై, జీవనోపాధి కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యం ప్రజలు చేస్తున్న ఉద్యమానికి పార్టీ తరపున ఆమె మద్దతు ప్రకటించారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంపెనీ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ప్రమాదం తొలగిపోలేదు..

మన్యం ప్రజల బతుకుల్లో విషం చిమ్మే బాక్సైట్‌ జిఒ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం. గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందువల్లే అయిష్టంగానైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. మంత్రి మండలి సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు స్థానికంగా వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనను సుదీర్ఘంగా వివరించిన తరువాత, నిఘా వర్గాల నివేదికలను పూర్తి స్థాయిలో పరిశీలించాక మరో మార్గం లేకే ఈ దిశలో నిర్ణయం తీసుకున్నారన్నది దాచినా దాగని సత్యం!

ప్రభుత్వం పోల‌వ‌రంను రీ డిజైన్ చేయాలి..

ప్ర‌భుత్వానికి జ‌ల‌వ‌న‌రుల వినియోగంలో చిత్త‌శుద్దిలేద‌ని సీపీఎం పోలిట్ బ్యూరో స‌భ్యుడు బీవీ రాఘ‌వులు విమ‌ర్శించారు. రాజ‌మండ్రిలో జ‌రిగిన స‌ద‌స్సులో పాల్గొన్న ఆయ‌న గ‌తంలో జ‌ల‌య‌జ్ఞం పేరుతో వైఎస్ హాయంలో జ‌రిగిన త‌ప్పిదాన్ని ఎత్తిచూపారు. ఇప్పుడు కేంధ్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా అదే బాట‌లో సాగుతున్నాయ‌ని ఆరోపించారు.ప్ర‌జ‌ల మీద చిత్త‌శుద్ధి ఉండి, పోల‌వ‌రం పూర్తిచేయాల‌నుకుంటే తొలుత రీ డిజైన్ చేయాల‌న్నారు. ఉన్న కొద్దిపాటి నిధుల‌ను వినియోగించి 120 అడుగుల మేర ప్రాజెక్ట్ పూర్తిచేయాల‌న్నారు. అప్పుడు నీటి వినియోగంలో ల‌క్ష్యాలు నెర‌వేరుతాయ‌న్నారు. నిర్వాసితుల స‌మ‌స్య కూడా రాద‌న్నారు.

Pages

Subscribe to RSS - 2015