
ఇటీవల కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో బుధవారం దుమారం రేకెత్తించాయి. మంత్రి ఇటీవల జరిగిన ఒక దళితుని కుటుంబం సజీవ దహనం సంఘటనపై మాట్లాడుతూ, వారిని కుక్కలతో పోల్చడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు కురిపించాయి. ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఇదే డిమాండ్‌తో తృణమూల్ కాంగ్రెస్, ఇతర వామపక్షాలు కూడా సభనుంచి వాకౌట్ చేశాయి