కార్మికవ్యతిరేక బిల్లు ఆమోదం

వివాదాస్పదమైన గుజరాత్‌ కార్మిక చట్టాల బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ప్రజా వినియోగ సేవల రంగాల్లో సమ్మెలను ఏడాదిపాటు నిషేధించే కార్మిక వ్యతిరేక నిబంధనలను గుజరాత్‌ ప్రభుత్వం ఈ బిల్లులో పొందుపరిచింది. గుజరాత్‌ తీవ్రవాద, సంఘటిత నేరాల నియంత్రణ (జిసిటిఓసి) బిల్లు, 2015ను కూడా దీనితో పాటే రాష్ట్రపతి వద్దకు పంపారు. ఈ రెండు బిల్లులకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని ప్రతిపక్షం నుండి విజ్ఞప్తులు రాష్ట్రపతికి అందాయి. హిందూ పత్రిక దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం ప్రకారం, సెప్టెంబరు 20నే గుజరాత్‌ కార్మిక చట్టాల (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు తేలింది.