2015

వృద్ధిరేటు భూటకం:సిపిఎం

మోడీ ప్రభుత్వం అవాస్తవిక అంకెలతో వృద్ధి రేటును పెంచి చూపుతోందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.మౌలిక ఆర్థిక సూచీలన్నీ నేల చూపులు చూస్తుంటే వృద్ధి రేటు పెరిగినట్లు చూపడంలో అర్థం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థ బేషుగ్గా వుందని చెప్పడం ప్రపంచ పతాక స్థాయి శీర్షికలకెెక్కేందుకు ఉపయోగపడవచ్చునేమో కానీ, ఆర్థిక వ్యవస్థ మూలాల పటిష్టతకు ఏమాత్రమూ తోడ్పడేది కాద న్నారు.

మతం రాజకీయాల్లో కూడదు:మధు

హిందూ, ముస్లిములు సఖ్యతగా మెలగాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బీజేపీ మతం పేరుతో పబ్బం గడుపుకుంటోందని మధు విమర్శించారు. మతసామరస్యంపై ఆవాజ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ జరిగింది. 

బాబ్రీబాధ్యులపైచర్యలేవి?:ఏచూరి

దేశంలో నానాటికీ పెరుగుతున్న మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని, మానవ సమాజాన్ని ఎర్రజెండా కాపాడుతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో దేశం తలదించుకోనే విధంగా పెట్రేగుతున్న మతోన్మాద ఘర్షణలు ,అసహనానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. బాబ్రీ మసీద్‌ కూల్చివేసి 23 ఏళ్లు కావస్తోందని, ఇప్పటికీ బాధ్యులైన వారిపై చర్యలు లేవని పేర్కొన్నారు. దేశంలో ప్రబలతున్న హిందూత్వ శక్తులకు సమాధానం చెప్పే రోజు వస్తుందన్నారు.

ప్రైవేటుకు అనుకూలంగా 633జిఓ

ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ సేవలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. అందుకు అనుకూలంగానే అక్టోబర్‌ 14న జిఓ నెంబర్‌ 633ను విడుదల చేసిందని ప్రజా ఆరోగ్య వేదిక ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. 

దళితులంతాపోరాటాల్లోపాల్గొనాలి:KVPS

నవసమాజ నిర్మాణం కోసం జరిగే సామాజిక ఉద్యమాలే అంబేద్కర్‌కు నిజమై న నివాళి అని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దడాల సుబ్బారావు అన్నారు. రాజమం డ్రిలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్‌ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌ సామాజిక న్యాయం కోసం పోరాడారని, కానీ నేటి పాలకులు సమాజం లో అంతరాలను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా దళి తులంతా సామాజిక పోరాటాల్లో పాల్గొనాలని కోరారు. మాజీ ఎంపీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబూరావు మాట్లాడుతూ దళితులు చదువుకోవ డం ద్వారా కొంత ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతున్నారని తెలిపారు.

మతోన్మాదంపై లౌకకవాద పార్టీలతో కలిసి పోరాటం

 బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ మతం పేరుతో ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని జమ్మూ కాశ్మీర్‌ సిపిఎం ఎమ్మెల్యే మొహమ్మద్‌ యూసుఫ్‌ తరిగామి విమర్శించారు.మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ ఆవాజ్‌ ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలో ఆదివారం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే యూసుఫ్‌ తరిగామి మాట్లాడుతూ, ఎన్నో కలలు కన్న స్వాతంత్ర భారతదేశం నేడు లేదని ,మత ఛాందసవాదం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించేందుకే ప్రభుత్వం అసహనం పెరిగిందనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పారు. వాస్తవానికి ప్రజలు ఎంతో సహనంగా ఉన్నారని తెలిపారు.

రైతు ఉద్ధరణ ఇలాగా?

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు తయారైంది పత్తి రైతుకు ప్రభుత్వం కల్పిస్తామన్న మద్దతు ధర. ఇంకేముంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేశాం పంట తేవడమే ఆలస్యం అని సర్కారీ పెద్దలు ఆశ పెట్టడంతో నిజమేననుకొని పత్తిని మార్కెట్‌ యార్డులకు తీసుకెళ్లిన రైతులు కొనుగోలు జాడ లేక తెల్లబోతున్నారు. తిరిగి పంటను ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేక దళారులకు అయిన కాడికి తెగనమ్ముకొని నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతులను రక్షించాల్సిన ప్రభుత్వమే వంచిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలీక గుండెలు అవిసేలా బోరుమంటున్నారు. రైతులంటే పాలకులకు ఎందుకంత అలుసో అర్థం కాదు.

వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ..

చెన్నై వరద బాధితుల సహాయార్థం విజయవాడలో సీపీఎం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టింది.  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య, సిహెచ్ .బాబురావు, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్ పలువురు సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.. తాగేందుకు మంచినీళ్లు కూడా లేని చెన్నై వాసులకు ప్రతీ ఒక్కరు మానవతా హృదయంతో సహాయం చేయాలని కోరారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వరద బాధితుల కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు.

Pages

Subscribe to RSS - 2015