బాబ్రీబాధ్యులపైచర్యలేవి?:ఏచూరి

దేశంలో నానాటికీ పెరుగుతున్న మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని, మానవ సమాజాన్ని ఎర్రజెండా కాపాడుతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో దేశం తలదించుకోనే విధంగా పెట్రేగుతున్న మతోన్మాద ఘర్షణలు ,అసహనానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. బాబ్రీ మసీద్‌ కూల్చివేసి 23 ఏళ్లు కావస్తోందని, ఇప్పటికీ బాధ్యులైన వారిపై చర్యలు లేవని పేర్కొన్నారు. దేశంలో ప్రబలతున్న హిందూత్వ శక్తులకు సమాధానం చెప్పే రోజు వస్తుందన్నారు. ఆదివారం ఢిల్లీలో బాబ్రీ మసీద్‌ కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆరు వామపక్ష పార్టీలు ''బ్లాక్‌ డే''ర్యాలీని మండిహౌస్‌ నుంచి జంతర్‌ మంతర్‌ వరకు నిర్వహించారు. దారి పొడుగునా మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.