2015

సిఐటియు కార్యాలయం పోరాటాల కేంద్రం

పల్నాడులో నిర్వహించే ప్రజా పోరాటాలకు పిడుగురాళ్లలోని సిఐటియు కార్యాలయం కేంద్ర బిందువుగా మారనుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ పేర్కొన్నారు. పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తి నగర్‌లో ఏర్పాటు చేసిన సిఐటియు కార్యాలయం (కన్నెగంటి హనుమంత్‌ భవనం)ను ఆయన బుధవారం ప్రారంభించారు. ముందుగా కార్యాలయ శిలాఫలకాన్ని గఫూర్‌ ఆవిష్కరించగా ప్రధాన గదిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు ప్రారంభించారు. యూనియన్‌ పతాకాన్ని రైతు సంఘం జిల్లా నాయకులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు కార్యాలయం నుంచి ఐలాండ్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

పార్లమెంట్లో హెరాల్డ్ కేసు రగడ

బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పెట్టిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు కోర్టుకు హాజరవ్వాల్సిందేనంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేయటంతో ఈ కేసుపై రాజకీయ దుమారం చెలరేగింది. తమ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ మంగళవారం పార్లమెంటును స్తంభింపజేసింది. అవి నిరాధార ఆరోపణలని తిరస్కరించిన ప్రభుత్వం.. సోనియా, రాహుల్‌లు విచారణను ఎదుర్కోవాలని సూచించింది. కేసు విషయంలో కాంగ్రెస్ చాలా జవాబులు చెప్పాల్సి ఉందంటూ..

437.35కోట్ల చందాలతో బీజేపీ..

దేశంలో వివిధ రాజ కీయ పార్టీలకు అందుతున్న చందాలలో 2014-15 ఆర్థిక సంవ త్సరంలో భారీ వృద్ధి నమోదైంది.వివిధ రాజకీయ పార్టీలు తమకు రూ. 20 వేలకు మించి అందిన విరాళాల వివరాలను ఎన్నికల కమి షన్‌కు సమర్పించిన జాబితాల ఆధా రంగా ఏడీఆర్‌ నివేదిక తయారైంది. అంటే ఇవి బహిరంగంగా ప్రకటించిన విరాళాల వివరాలు మాత్రమే. ప్రకటిం చనివి ఇంతకు పలు రెట్లు అధికంగా ఉంటాయనేది తెలిసిందే. ప్రకటించిన మేరకే చూసినా, రూ. 437.35 కోట్ల చందాలతో బీజేపీ అన్నింటికన్నా ముందున్నదని సంస్థ తెలిపిన వివరాల్లో ఉంది.

రాజధానినుండిఢిల్లీకిమట్టి,నీరు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు ప్రత్యేక హోదా కమిటీ సభ్యులు. ఉద్దండరాయపాలెం నుంచి మట్టి,నీరు తీసుకువచ్చి ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద కలిపారు. కేంద్రం మాటలతో కాలయాపన చేస్తోందని వెంటనే ఏపీకి విభజన హామీలను అమలు చేయాలని సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  డిమాండ్ చేశారు. 

గ్రామాలు ఖాళీచేయండి:బాబు

పోలవరం నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయకుండా మొండికేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. డిసెంబర్‌ నెలాఖరుకు చేగొండపల్లి, జనవరి నెలాఖరుకు పైడిపాక, రామయ్యపేట గ్రామాలను ఖాళీ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నిర్వాసితులు ఊళ్లు వదిలిపెట్టకపోతే వారికి అందాల్సిన పరిహారం దక్కకుండా పోతుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు కూడా అందవని స్పష్టంచేశారు. 

MLCఎన్నికల్లోCPMదూరం:తమ్మినేని

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని, తమ పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఓటింగ్‌కు దూరంగా ఉంటారని తెలంగాణా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఖమ్మంలో మాత్రం సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావును బలపరుస్తున్నట్టు చెప్పారు.

భూములిచ్చిన రైతుల్లో అసహనం..

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో అసహనం పెరిగిపోతోంది. పూలింగులో ఉన్న శ్రద్ధ తమకు వాటా ఇచ్చే సమయంలో లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. జనచైతన్య యాత్రలనూ బహిష్కరిస్తున్నారు.రాజధాని ప్రకటించిన తొలిరోజే భూములిచ్చామని, ఇంతవరకు ప్లాట్లు ఎక్కడిస్తారో చెప్పడం లేదని టిడిపి నాయకులను ప్రశ్నిస్తున్నారు.

పాక్ వెళ్లనున్న భారత ప్రధాని..

భారత ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే పాకిస్తాన్‌కు వెళ్లనున్నాడని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. హార్ట్ ఆఫ్‌ ఏషియా సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్లిన ఆమె మీడియాతో ఈ విషయాన్ని తెలిపారు. 2016లో జరగబోయే సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజనల్‌ కోపరేషన్‌ (సార్క్) సమ్మిట్‌లో భాగంగా మోడీ ఇక్కడి రానున్నట్లు పేర్కొన్నారు.

మద్యంపైజగన్ మాటలుహాస్యాస్పదం

 బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావును పక్కన పెట్టుకుని జగన్‌ మద్యపాన నిషేధంపై మాట్లాడటం హాస్యాస్పదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.  వైఎస్‌ హయాంలో మద్యం ఏరులై పారిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కల్తీ మద్యం వల్ల పదుల సంఖ్యలో జనం చనిపోయారని తెలిపారు. కల్తీ మద్యం కేసులు బొత్స కుటుంబంపై ఇంకా ఉన్నాయని సోమిరెడ్డి వెల్లడించారు. కల్తీ మద్యం ఘటనను ప్రభుత్వం సీరియస్ తీసుకుందన్నారు. అందుకు నిదర్శనంగా ప్రభుత్వ సిట్‌ను ఏర్పాటు చేసిందని చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు.

విజయవాడ కల్తీ మద్యం ఘటనపై నిరసన..

విజయవాడ కల్తీ మద్యం ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో జ్యూడిషియల్‌ విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యత వహించి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర తక్షణమే రాజీనామా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. కల్తీ మద్యం ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బందర్‌ రోడ్డులోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎక్సైజ్‌ మంత్రి రాజీనామా చేయాలని, ఎక్సైజ్‌ పాలసీని మార్చాలని, స్వర్ణా బార్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలు ముఖానికి నల్లగుడ్డలు కట్టుకుని ప్రభుత్వ మద్యం పాలసీపై నిరసన వ్యక్తం చేశారు.

Pages

Subscribe to RSS - 2015