
బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావును పక్కన పెట్టుకుని జగన్ మద్యపాన నిషేధంపై మాట్లాడటం హాస్యాస్పదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో మద్యం ఏరులై పారిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కల్తీ మద్యం వల్ల పదుల సంఖ్యలో జనం చనిపోయారని తెలిపారు. కల్తీ మద్యం కేసులు బొత్స కుటుంబంపై ఇంకా ఉన్నాయని సోమిరెడ్డి వెల్లడించారు. కల్తీ మద్యం ఘటనను ప్రభుత్వం సీరియస్ తీసుకుందన్నారు. అందుకు నిదర్శనంగా ప్రభుత్వ సిట్‌ను ఏర్పాటు చేసిందని చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు.