2015

ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృ‌తి కోసం ఉద్యమించాలి

కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య గారి శత జయంతి సందర్భంగా ఈరోజు సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడమని కోరారు. ఇంతకుముందు భాషా వికాసం గురించి మాట్లాడిన కొత్తపల్లి రవిబాబుగారు నాకో కరపత్రం ఇచ్చారు. మాతృభాష ప్రాధాన్యత గురించి ఛాయారాజ్‌గారు రాసిన మంచి కవిత్వం దానిలో ఉంది. అందులోని చివరి చరణాలు.
''అమ్మా నీ భాష కావాలి.
నిప్పులు చెరగటానికి..
చెమటను జల్లెడ పట్టి సంపదలను తీయడానికి..
తెలుగు పౌరుషాగ్నిని రాజేయడానికి.. మాతృభాష కావాలి..''

భారత్‌ - చైనా

భారత్‌, చైనాల మధ్య అభివృద్ధిలో పోలికలు ఈనాటివి కావు. రెండు దేశాలూ రెండేళ్ల తేడాతో విముక్తి పొందడం, జనాభాలో, ఆర్థికాభివృద్ధిలో దాదాపు ఒకే విధంగా ఉండడం వల్ల ఈ పోలికలు నాటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వం చైనా భారత కన్నా వెనుకబడి ఉండేది. సోషలిస్టు నిర్మాణం తరువాతా, 1980 దశకంలోనూ చైనా అప్రతిహత అభివృద్ధి సాధించడంతో భారత్‌ను అధిగమించి ముందుకు పోయింది. గత 20 ఏళ్లకు పైగా రెండంకెల అభివృద్ధితో నడుస్తున్న చైనా వేగం మందగించిందనీ, భారత్‌ వచ్చే ఏడాది అభివృద్ధిలో దాన్ని అధిగమిస్తుందనీ ఆర్థిక పండితులు, సంస్థలు చెబుతున్నాయి.

రాజరికంపై గిరిజనుల తిరుగుబాటు బావుటా కామ్రేడ్‌ దశరథ దేవ్‌

                      సిపియం కేంద్రకమిటి సభ్యులు, త్రిపుర రాష్ట్ర మాజీముఖ్యమంత్రి దశరథ్‌దేవ్‌ శతజయంతి ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండవతేదీ నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి రెండవతేదీన అగర్తలాలోని రవీంద్ర శతవార్షిక భవన్‌లో జరిగిన సభలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి, సిపియం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ దశరథ్‌దేవ్‌ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. 'రాజా దశరథ్‌' అని గిరిజనులు ముద్దుగా పిలుచుకొనే దశరథ్‌ దేవ్‌ ఖోవారు సబ్‌డివిజన్‌లోని సుదూర గ్రామమైన అంపురాలో 1916 ఫిబ్రవరి రెండవ తేదీన పేదగిరిజన రైతు కుటుంబంలో జన్మించాడు.

రాజరికంపై గిరిజనుల తిరుగుబాటు బావుటా కామ్రేడ్‌ దశరథ దేవ్‌

సిపియం కేంద్రకమిటి సభ్యులు, త్రిపుర రాష్ట్ర మాజీముఖ్యమంత్రి దశరథ్‌దేవ్‌ శతజయంతి ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండవతేదీ నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి రెండవతేదీన అగర్తలాలోని రవీంద్ర శతవార్షిక భవన్‌లో జరిగిన సభలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి, సిపియం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ దశరథ్‌దేవ్‌ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. 'రాజా దశరథ్‌' అని గిరిజనులు ముద్దుగా పిలుచుకొనే దశరథ్‌ దేవ్‌ ఖోవారు సబ్‌డివిజన్‌లోని సుదూర గ్రామమైన అంపురాలో 1916 ఫిబ్రవరి రెండవ తేదీన పేదగిరిజన రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన 1943లో అగర్తలాలోని ఉమాకా ంత స్కూల్‌లో మెట్రిక్యులేషన్‌లో మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు.

ఉడతకేల ఊర్లో పెత్తనం..

వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారులను విమర్శిస్తూ కాశీకి బయలుదేరినట్లుగా ఈనెల 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెను విమర్శిస్తూ పారిశ్రామిక, వ్యాపారవేత్తల సంఘాలు దేశభక్తి తమకే ఉన్నట్లు నీతి వాక్యాలు బోధిస్తున్నాయి. పాలకుల పంచన చేరిన బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలు (కార్పొరేట్లు) దేశ ఆర్థిక వ్యవస్థకు సమ్మె వల్ల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంటున్నారు. దేశభక్తుల ఇంటికి, తమకు తడికే అడ్డం అన్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. భారత్‌కు వ్యాపార నిర్వహణకు అనుకూలంగా ఉన్న దేశం అనే మంచి పేరు పోతుందని ఆవేదన వ్యక్త పరిచారు. ఇంతటితో ఆగకుండా దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు.

Pages

Subscribe to RSS - 2015