2015

భారత్ కు పాక్ అణుహెచ్చరిక..

రక్షణ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగించడానికి వెనుకాడమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు. పాక్ చానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన కుండబద్దలు కొట్టారు. ‘మమ్మల్ని రక్షించుకోవడానికి అణుబాంబులు మాకున్న అవకాశాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం మేం ఉంచుకోవడం లేదు. అయితే ఆ అవసరం ఎప్పటికీ రాకూడదని మేం భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాం. కానీ మాకే ప్రమాదం వస్తే ఉపేక్షించేది లేద’ని పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదం పేట్రేగిపోతుండడం.. భారత్‌‌తో పరోక్ష యుద్ధానికి దారి తీయొచ్చని చెప్పారు.

త్వరలో వ్యాట్సప్‌పై బ్యాన్..

వ్యాట్సప్‌ను త్వరలో నిషేధించే యోచనలో యుకే ఉంది. ఇందుకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురానుంది. వ్యాట్సప్ వినియోగదారుల మధ్య జరుగుతోన్న కోడ్ లాంగ్వేజ్ సంభాషణలను నిషేధించేందుకు ఆ దేశ ప్రధాని తీవ్ర ప్రయత్నంలో ఉన్నారు. వ్యాట్స్‌అప్, ఈ మేసేజ్, స్నాప్‌చాట్ వంటి మూడు మెస్సేజ్ సేవలను ప్రస్తుతం యూకేలో మొబైల్ వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ ఈ నూతన చట్టం కనుక అమలులోకి వస్తే ఈ మూడు మెసేజ్ సేవలను చట్టవిరుద్దంగా పరిగణించనున్నారు - 

అప్పుల బాటలో ఏపి

రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది. ప్రస్తుతం ఖజానా 2323 కోట్ల రూపా యల కొరతతో ఉన్నట్లు ఆర్ధిక శాఖ వెల్లడిరచిరది. ఆదాయం తగ్గు ముఖం పట్టడం, ఖర్చులు పెరిగిపోవడంతో తాజాగా వెయ్యి కోట్ల రూపాయల అప్పుకు వెళ్లాల్సి వస్తోరది. ఇది ప్రభుత్వానికి ఇబ్బరదులు కలిగిస్తోరది. ప్రతి రోజూ అనేక అత్యవసర అరశాలకు నిధులు విడుదల చేయాల్సి వస్తోందని అధికా రులు అంటున్నారు. అరదుకు తగ్గ స్థాయిలో ఆదాయం లేకపోవడం ఈ పరిస్థి తికి కారణంగా విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితిపై అర్ధిక శాఖ తాజా పరిస్థితిపై ఒక నివేదిక సిద్ధరచేసిరది.

పది వామపక్షాల తీర్మానం...

ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వమిచ్చిన వాగ్దానం మేరకు డ్వాక్రా సంఘాలన్నింటికీ లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా దీన్ని వర్తింపజేయాలని పది వామపక్ష పార్టీల రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. డ్వాక్రా మహిళల సమస్యలపై గురువారం వామపక్షాల ఆధ్వర్యాన గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.

చారిత్రాత్మక తీర్పు

జులై5న నిర్వహించిన రిఫరెండమ్‌లో గ్రీకు ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ప్రపంచ అభ్యుదయగాముక ప్రజల్లోనూ, శ్రామిక వర్గంలోనూ ఈ తీర్పు ఎంతటి ఉద్వేగం కలిగించిందో ఏథెన్స్‌తో సహా లండన్‌, మాడ్రిడ్‌ వంటి నగరాల్లో వ్యక్తమైన హర్షాతిరేకాలే తెలియజేస్తున్నాయి. తమ జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీసే ఇయు రుణదాతల షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని గ్రీకు ప్రజలు ఈ రిఫరెండం ద్వారా మరోసారి తిరుగులేని తీర్పునిచ్చారు. గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో పొదుపు చర్యలకు వ్యతిరేకంగా పలు హామీలు ఇచ్చిన సిప్రాస్‌ నేతృత్వంలోని సిరిజా పార్టీకి వారు విజయం చేకూర్చి పెట్టారు.

ప్రభుత్వ వైఖరి వల్లే ఆత్మహత్యలు : పి.మధు

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోడితాడిపర్రులో దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న తమ భూములను బలవంతంగా వేలం వేయాలని దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆరుగురు రైతుల్లో మరొకరు బుధవారం ఉదయం మృతి చెందారు.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న వీర్లపాటి చెత్తయ్య(70) బుధవారం ఉదయం మృతిచెందాడు. దీంతో బాధితులు మరింత ఆగ్రహంతో ప్రభుత్వాస్పత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీబీఐకి వ్యాపం: సుప్రీం

వ్యాపం అంశంపై దర్యాప్తు చేపట్టా ల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ.)ని ఆదేశించింది. వరుస హత్యలతో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారంలో ఒక కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో వ్యాపం మృతుల సంఖ్య 46కు చేరింది. వ్యాపం కుంభకోణం మామూలు అవినీతి కుంభకోణం లాంటిది కాదని, రాజకీయ పెద్దలకు, మాఫియా కలగలిసి నడిపిన పెద్ద కుంభకోణమని ఈ హత్యా పరంపర చూస్తే అర్థమవుతున్నది.

విజయవాడ మెట్రోకు మోకాలడ్డు

 నవ్యాంధ్ర రాజధాని చెంతనే ఉన్న ఆంధ్రుల వాణిజ్య రాజధాని విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాక్షాత్తు రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రే ’విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెకు’్టకు మోకాలడ్డుతున్నట్లు సమాచారం. రోజురోజుకూ విస్తరిస్తున్న విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి వరకు మెట్రో రైలు మా ర్గాన్ని నిర్మించాలని ఏపీ సర్కార్‌ భావించింది.

Pages

Subscribe to RSS - 2015