2015

భారత కార్మికోద్యమ చరిత్ర

ప్రముఖ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు, ప్రసిద్ధ రచయిత సుకోమల్‌ సేన్‌ బృహత్తర రచన 'భారత కార్మిక వర్గం -ఆవిర్భావం, ఉద్యమం, 1830-2010'. క్షుణ్ణంగా సవరించి, విస్తరించిన తృతీయ ప్రతికి తెలుగు అనువాదం ఇది. రచయిత తొలి ప్రతి ముందు మాటలో పేర్కొన్నట్లు ఇది సంప్రదాయ సిద్ధమైన ట్రేడ్‌ యూనియన్‌ చరిత్రలకు భిన్నమైనది. విస్తృతమైన జాతీయ, అంతర్జాతీయ నేపథ్యంలో భారత కార్మిక వర్గ పోరాటాలను రాజకీయాలు ఆర్థికాంశాల పరస్పర ప్రభావాలను గమనంలోకి తీసుకొని సాగిన రచన ఇది. భారత దేశంలో కార్మిక వర్గ ఆవిర్భావం, సంపన్న దేశాలలో కార్మిక వర్గ ఆవిర్భావానికి భిన్నమైన రీతిలో వలస పాలకులు పూర్తి ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో జరిగింది.

బాబు సెటిల్మెంట్ సిఎం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ట్యాపింగ్ తప్పు అని చెప్పిన చంద్రబాబు ఏ చట్టం ప్రకారం ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. బాబు సీఎంలా కాదు.. సెటిల్‌మెంట్ మినిస్టర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు యత్నిస్తున్నాడన్న వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. 

నవ్యాంద్రాలో మద్యం మాఫియా

నవ్యాంద్రాలో మద్యం మాఫియా విచ్చల విడిగా పెచ్చురిల్లుతుందని..రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్య విధానం వల్ల మండల స్థాయిలో బెల్ట్‌ షాపులు పెరుగుపోతున్నాయని మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన చంద్రబాబు మహిళ వ్యతిరేఖ విధానాలు రూపొందుస్తున్నారని ఆరోపించారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే జాతీయ మహిళ కాంగ్రెస్‌ సమావేశాలకు ఢిల్లీ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ...కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాల, భూఆర్ధినెన్స్‌,బీజేపీ అవినీతిపై చర్చించామన్నారు.

మాజీ సైనికోద్యోగులకు అండగా సిపిఎం

 'ఒక ర్యాంక్‌కి ఒక పెన్షన్‌' అంటూ మాజీ సైనికోద్యోగులు చేస్తున్న సుదీర్ఘ డిమాండ్‌కు తమ పూర్తి మద్దతు, సంఘీభావం ఎల్లప్పుడూ వుంటుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. గత నెల 14వ తేది నుండి ఇక్కడ జంతర్‌మంతర్‌ వద్ద వారు చేస్తున్న ధర్నాకి, నిరవధిక రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఏచూరి ఒక లేఖ రాశారు. ఈ దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత కోసం సాయుధ బలగాలు ఎనలేని త్యాగాలు చేశాయని ఆయన ఆ లేఖలో కొనియాడారు.

రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు : బాబు

తప్పు చేసిన వారు ఎవ్వరైనా వదిలిపెట్టే సమస్య లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం పలువురు కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు అనంతర మీడియాతో మాట్లాడుతూ..తాను జులై 5న జపాన్‌కి వెళ్లి 9న సాయం త్రం ఢిల్లీకి చేరుకున్నానని, ఏపీకి పెట్టుబడులే ముఖ్యద్ధేశ్యంగా తాను జపాన్‌లో అనేక మంది మంత్రులను, ప్రభుత్వ సంస్థలని, ప్రైవేటు వ్యక్తులని కలిశానని వారందరూ పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే 7 ప్లాంట్‌లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం

మీడియా, పత్రికా జర్నలి స్టులపైన భౌతిక, దూషణలతోకూడిన దాడులు పెరిగాయని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీిఐ) ఆందోళన వ్యక్తంచేస్తూ వీటిని శిక్షార్హమైన నేరంగా పరిగణించి శిక్షించటానికి వీలుగా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. జర్నలిస్టులపై జరిగే దాడులన్నింటినీ ప్రత్యేక కోర్టులకు సమర్పించి దర్యాప్తు చేయించాలని, చార్జిషీటు దాఖలు చేసిన సంవత్సరంలోపు విచారణ పూర్తిచేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ కోరింది. జర్నలిస్టుల రక్షణకు సంబంధించి ప్రెస్‌కౌన్సిల్‌ సబ్‌కమిటీ పలు సిఫార్సులు చేసింది. సిఫారసులను కౌన్సిల్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ జడ్జి చంద్రమౌళికుమార్‌ ప్రసాద్‌ విలేకరులకు గురువారం వివరించారు. 

పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమే

ఇటీవల స్మార్ట్‌ సిటీల గురించి పదేపదే వార్తలొస్తు న్నాయి. 2014లో ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణం చేసిన తర్వాత భారతదేశంలో స్మార్ట్‌సిటీలు నిర్మిస్తామని ప్రకటించారు. దేశంలో 100 నగరాలు నిర్మిస్తామని, కనీసంగా ప్రతి రాష్ట్రంలోనూ ఒక నగరమైనా నిర్మిస్తామని ప్రకటించారు. గరిష్టంగా గుజరాత్‌, కేరళ, కర్ణాటకలో ఒక్కో రాష్ట్రంలోనూ ఏడు సిటీల చొప్పున, కనిష్టంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే ఒక్క నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో సరాసరిన 4 నుంచి 5 వరకూ నగరాలను నిర్మించనున్నట్టు ప్రకటనలు గుప్పించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నగరాలు నిర్మిస్తారు.

అధికార మాఫియా

 అసలే ఇసుక మాఫియా, దానికి అధికార పార్టీ అండ చేరితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వంలో భాగమైన శాసనసభ్యుడు అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి తానే స్వయంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి ఆనక అడ్డొచ్చిన తహసీల్దార్‌పై మహిళ అని కూడా చూడకుండా మందీమార్బలంతో విచక్షణారహితంగా దాడి చేయడం ఘోరం. అక్రమ ఇసుక దందాను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి చితక బాదడం దారుణం. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేటలో తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్‌ ప్రభుత్వ యంత్రాంగ మనోనిబ్బరంపై వేసిన వేటు.

ఇలా ఐతే రాష్ట్ర వ్యాప్త బంద్ తప్పదు : మధు

పదో పిఆర్‌సి ప్రకారం రూ. 15,432 కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు శుక్రవారంనుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. పలు జిల్లాల్లో విధుల బహిష్కరించి ర్యాలీలు, రాస్తా రోకోలు, ధర్నాలు తదితర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. వివిధ రూపాల్లో వెల్లువెత్తిన వీరి ఆందోళనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు పలకడం విశేషం. వెంటనే సమస్యలను పరిష్క రించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్‌ తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు.

ఏకపక్షంగా చట్టాల సవరణ: గఫూర్‌

మోడీ, చంద్ర బాబు ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌ దుయ్య బట్టారు. తిరుపతిలోని ఎంబి భవన్‌లో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల క్లస్టర్ల సమావేశంలో ఆయన ప్రసం గించారు. సెపెంబర్‌ 2న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వ త్రిక సమ్మె ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకొన్న చట్టాలను మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా సవరణకు పూనుకుందన్నారు.

Pages

Subscribe to RSS - 2015