2015

పుష్కరాల్లో తొక్కిసలాట

గోదావరి పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పలువురు మృతి చెందారు.పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఇక్కడ జరుగుతున్న పుష్కరాల్లో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఒకే ఘాట్ కు చేరుకున్నారు. దీనితో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసు యంత్రాంగం చేతులెత్తేశారు. భద్రతా వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపించింది. పది లక్షల జనాలు వస్తారని అంచనా వేసినా కనీస సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హూద్ హూద్ తుఫాన్ లో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

ఈ రోజు విశాఖ ఏజెన్సీ అరుకు MPDO ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె. లోకనాధం మాటలాడుతూ విశాఖ జిల్లాలో హూద్ హూద్ తుఫాన్ వాళ్ళ పడిపోయిన సిల్వర్ ఒక్ చెట్లు తొలగించుటకు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా ఒక సిల్వర్ చెట్టుకు రూ . 100 /-లు చొప్పున ఒక్కొక రైతుకు 150 చెట్లుకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికి చెల్లించకపోవడం దుర్మార్గం.ఒక అరుకు మండలంలోనే 14 పంచాయతీల పరిధిలో 170 గ్రామాల్లో ప్రభుత్వ అధికారులే సర్వ్ జరిపి 2574 మంది రైతులు నష్టపోయారని గుర్తించారు.

కాంగ్రెస్‌ పై పవన్ విసుర్లు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ పార్టీని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్‌ నేతలు గాలికొదిలేశారని, లలిత్‌మోదీ వివాదానికి ఆ పార్టీ పరిమితమైందని ఆయన తన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. 5 కోట్ల మంది సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాంగ్రెస్‌ నేతలకు పట్టదా అని పవన్‌ ప్రశ్నించారు.

అభివృద్ధికి అడ్డం చంద్రబాబే

అభివృద్ధికి అడ్డం వస్తే అణిచివేస్తానంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని, అభివృద్దికి అడ్డం వస్తుందే చంద్రబాబని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ పుణ్యవతి విమర్శించారు. కార్మికులు తమ హక్కులు కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునేందుకు సెప్టెంబర్‌ రెండున దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన ఏడాదికాలంలో కార్మికుల శ్రమను దోచి కార్పోరేట్‌ వర్గాలకు అప్పగించేందుకు ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు వచ్చిన ఏడాదిలో 1600 మంది ఉద్యోగులకు తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు.

మావోయిస్టుల అల్టిమేటం

మన్యంలో బాక్సైట్‌ ఖనిజం వెలికితీతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేస్తూ విశాఖ మన్యంలోని తెలుగుదేశం, బీజీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలకు లేఖలు పంపినట్టు తెలిసింది. ఇవి మావోయిస్టు పార్టీ ఈస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి కైలాసం, మరో నేత లక్ష్మి మన్యం పరిధిలోని మండలాలకు చెందిన పలువురికి అందినట్టు సమాచారం. బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని, ఆ ప్రయత్నాలను విరమించుకుంటున్నట్టు ప్రభు త్వం బహిరంగ ప్రకటన చేసేలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మావోయిస్టులు ఆ లేఖల్లో పేర్కొన్నట్టు తెలిసింది.

కాంగ్రెస్‌ డ్రామాలు మొదలు..

 వచ్చే వారం మొదలు కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వివాదాస్పద భూ సేకరణ బిల్లు ఆమోదం పొందడానికి వీలుగా, జులై 15న ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. నీతి ఆయోగ్‌ ఏర్పడిన తరువాత ఇలా సమావేశం కావడం ఇది రెండవసారి. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశమే లేదు. భూ సేకరణ బిల్లు రైతు వ్యతిరేకం అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష కాంగెస్‌ తన పార్టీ వారికి ఆ విధంగా సూచనలు ఇచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పాగా

 ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో తమ పార్టీ శాఖల పని తీరుపట్ల పూర్తి అసంతృప్తితో ఉన్న బిజెపి అధినాయకత్వం కాయకల్ప చికిత్సకు సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విడివిడిగా నిర్వహించిన సమీక్షా సమావేశాలలో పార్టీ నాయకుల పని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతోసహా తెలంగాణ నాయకులకు ఇప్పటికే అమిత్ షా క్లాసు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీచేసి విజయం సాధించని పక్షంలో సంస్థాగతంగా భారీ మార్పులు జరిగే అవకాశాలున్నాయి.

'వ్యాపమ్' సినిమాగా..

సమాజంలో పాతుకుపోయిన లోటు పాట్లనే కథా వస్తువులుగా మలచుకుని... ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా తెరకెక్కించడం ప్రకాశ్ ఝాకు మాత్రమే తెలిసిన విద్య అనడంలో సందేహమేలేదు. ఆరక్షణ్, రాజనీతి, సత్యాగ్రహ, చక్రవ్యూహ్ వంటి సినిమాలను తెరకెక్కించి... విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రకాశ్ ఝా ప్రస్తుతం గంగాజల్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఇక మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సినిమాను తెరకెక్కిస్తున్న ఈ డైనమిక్ డైరెక్టర్... పనిలో పనిగా ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తున్న వ్యాపం స్కామ్ పైన దృష్టి సారించాడట.

రాజధాని భూముల్లో సాగు

ల్యాండ్‌ పూలింగ్‌లో భూములివ్వని నిడమర్రు పొలాల్లో విత్తనాలు వేసి సాగు పనులను సిపిఎం, వైసిపి ఆధ్వర్యంలో ఆదివారం రైతులు ప్రారంభించారు. తొలుత నిడమర్రు గ్రామంలోనుండి పొలాల వరకు వైసిపి, సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రత్నారెడ్డి పొలంలో ట్రాక్టర్‌తో దున్ని వరి విత్తనాలను చల్లారు. నీరుపెట్టి మట్టిని చదునుచేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు మాట్లాడు తూ జపాన్‌, సింగపూర్‌, కార్పొరేట్‌ కంపెనీలకు ప్రయోజ నాలు చేకూర్చి లబ్ధిపొందేందుకు టిడిపి ప్రయత్నిస్తుంద న్నారు. దానిలో భాగంగానే వేలాది ఎకరాల సమీకరించిం దన్నారు.

Pages

Subscribe to RSS - 2015