2015

ఆంధ్రాకు అణు ప్రమాదం..

అణు కేంద్రాలు సీసాలో బంధించిన పెను భూతాలని, ఎప్పుడు ప్రమాదమొస్తుందో తెలియదని, ప్రమాదం సంభవిస్తే ఎవరూ రక్షించలేరని భారత ఆర్థిక, ఇంధన వనరుల శాఖ విశ్రాంత కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ అన్నారు. కొవ్వాడ అణుపార్కు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్వాన శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో కొవ్వాడ అణుపార్కుపై అణు నిపుణులతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన సోమవారం చర్చా వేదిక జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శర్మ మాట్లాడుతూ, అణు వ్యర్థాలు అత్యంత విషతుల్యమని, ప్రమాదకరమని, సాంకేతికంగా వాటికి పరిష్కారం లేదని తెలిపారు.

రాష్ట్రంలో రాహుల్ పర్యటన

 ఆత్మహత్యలకు పాల్పడ్డ అనంతపురం రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అడ్డుకోవటానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుహెచ్చరించారు. హైదరాబాద్‌లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు తగిన శాస్తితప్పదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా తమ జాగీరుకాదన్న నిజాన్ని గ్రహించి జాగ్రత్తగా మసులుకోకపోతే పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి, ఆయన సొదరుడు ప్రభాకర్‌రెడ్డితీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుందని విహెచ్ హెచ్చరించారు. పార్టీ చంద్రబాబు టిడిపి ప్రజాప్రతినిధులను అదుపుచేయాలని ఆయన సలహా ఇచ్చారు.

తొక్కిసలాట దురదృష్టకరం:సీఎం

పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పరంగా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఒకే ఘాట్‌కు ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు.పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పుష్కర ఘాట్‌ల వద్ద అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఈ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి బయలుదేరి వెళ్లారు.

1975 ఎమర్జన్సీ సరైనదే..

దేశంలో 1975లో అత్యవసర పరిస్థితి విధించినందుకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. ఆ నిర్ణయం సరైనదేనని ప్రజలు గ్రహించారని, ఇందిరాగాంధీకి ఓటు వేసి తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. సోమవారం ఆయన ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఎందుకు మేం క్షమాపణ చెప్పాలి? అత్యవసర పరిస్థితిపై ఎందుకు చరించాలి? కొన్ని సంఘటనలు జరిగాయి. ఆతర్వాత దేశ ప్రజలు మళ్ళీ ఇందిరాగాంధీని ప్రధానిగా ఎన్నుకున్నారు. అందువల్ల మేం క్షమాపణ చెప్పాలంటే, అప్పుడు భారత ప్రజలు కూడా క్షమాపణ చెప్పాల్సి వుంటుంది.

బొగ్గు స్కాంలో బుక్కయారు

దేశంలో సంచనలం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదుచేయాల్సిందిగా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిపై అభియోగాలు ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ విచారణలో బొగ్గుశాఖ కార్యదర్శి హెచ్ సీ గుప్తా జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసును కూడా చేర్చాలని స్పష్టం చేసింది. గతంలోనే మధుకోడాకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

ఆర్థిక అసమానతలు

ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనికుల సంపద 50 శాతం ప్రపంచ జనాభాకు సరిసమానమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఇదిలాఉండగా యుకె ఓవర్‌సీస్‌ డిపార్ట్‌మెంటు ఆధారంగా ప్రపంచబ్యాంకు చెప్పిన 120 కోట్ల జనాభా కన్నా మరింత ఎక్కువమంది రోజుకు 1.25 డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతూ దారిద్య్రావస్థలో ఉన్నారు. 

చంద్రబాబు కీలక నిర్ణయం

మార్కెట్‌ కమిటీల ఆదాయానికి, ఉద్యోగుల రిటైర్మెంట్‌కు ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆదాయం బాగా ఉన్న మార్కెట్‌ కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు 60 ఏళ్లకు, ఆదాయం లేని కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు 58 ఏళ్లకు రిటర్మెంట్‌ ఉండేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై జీవో జారీ చేసే సమయానికి ఈ నిర్ణయంపై వివాదం నెలకొంది. ఉంటే 58 ఏళ్లు ఉండాలి లేదా 60 ఏళ్లు ఉండాలి తప్ప మార్కెట్‌ కమిటీల ఆదాయాన్ని బట్టి రిటైర్మెంట్‌ వయసు నిర్ణయించడం సాధ్యం కాదని న్యాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఫైలు పునఃపరిశీలన కోసం సీఎం వద్దకు వెళ్లనుంది.

భూములు లాక్కుంటే ప్రతిఘటన తప్పదు : సిపిఎం

 రాజధాని పరిసర ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అటవీ భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు, చిన్న, సన్నకారు రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. సోమవారం విజయవాడలోని అటవీ శాఖ డిఎఫ్‌ఓ కార్యాలయం ఎదుట సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సిపిఐ(ఎంఎల్‌), ఎంసిపిఐ(యు)లతో కలిపి ఆరు వామపక్ష పార్టీల నేతృత్వంలో భారీ ధర్నా జరిగింది. ధర్నా కార్యక్రమంలో విజయవాడ రూరల్‌, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల నుండి ప్రజలు హాజరయ్యారు.

ప్రభుత్వ స్కూళ్ళు నిర్వీర్యం

మోడల్‌ ప్రైమరీ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలలను కుదించే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 1752 ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 250 పాఠశాలలు కనుమరుగయ్యే అవ కాశం ఉంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్ర భుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం పట్ల మేధా వులు పెదవి విరుస్తున్నారు. మోడల్‌ ప్రైమరీ పాఠ శాలలకు ప్రామాణికంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనావళిని పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయా లు వెల్లడవుతున్నాయి.

Pages

Subscribe to RSS - 2015