2015

నాగార్జున వర్శిటీలో ఆత్మ‌హ‌త్య

గుంటూరు జిల్లా‌లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్కే(బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ఫస్టియర్ చదువుతున్న రుషితేశ్విని అనే విద్యార్థిని ఉరేసుకుంది. మృతురాలిది వరంగల్ జిల్లా అని తెలుస్తోంది. ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

బాబు కాశీకి వెళ్లి ప్రక్షాళన చేసుకోవాలి:జగన్‌

గోదావరి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా తొలి రోజు మంగళవారం ఉదయం రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్ రెడ్డి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్టాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీవీఐపీ ఘాట్‌కు వెళ్లకుండా పబ్లిసిటీ కోసం సాధారణ భక్తుల ఘాట్‌కు వెళ్లారని విమర్శించారు. ఆయన రాక కారణంగా రెండున్నర గంటల పాటు భక్తులను ఆపడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

భక్తులు సంయమనంతోవుండాలి:పవన్

రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ అన్నారు. తాను పరామర్శకు రావాల్సి ఉన్నప్పటికీ, తాను వస్తే మళ్లీ తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నందున రావటం లేదని పవన్ వివరణ ఇచ్చారు. తాను లేకపోయినా, తన అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్యం బాధిత కుటుంబాలకు తగిన పరిహారాన్ని ప్రకటించాలని కోరారు. పుష్కరాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. భక్తులు కూడా సంయమనంతో పుష్కరాల్లో పాల్గొనాలని సూచించారు.

నదుల అనుసంధానానికే మొగ్గు

దేశంలో నదుల అనుసంధానం తక్షణ అవసరమని జాతీయ జల వనరుల అభివృద్ధి మండలి సమావేశం అభిప్రాయపడింది. రెండు నెలలకొకసారి జరిగే ఈ జలఅభివృద్ధి మండలి సమావేశం సోమవారం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఒత్తిడి మేరకు కేంద్ర నదీ జలాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నదుల అనుసంధానానికి ప్రత్యేక కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నదుల అనుసంధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ ప్రభుత్వం మిగులు జలాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సండ్రకు బెయిల్ మంజూరు

ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా తెలంగాణ ఏసీబీ ఆరోపిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు సండ్రకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. 

బాబూ ఆత్మవిమర్శ చేసుకో:చిరు

రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడటంపై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు.కృష్ణా పుష్కరలప్పుడు జరిగిన ఘటనపై ప్రతిపక్ష నాయకుడిగా తను చేసిన వ్యాక్యల్ని గుర్తుచేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.. 

25లక్షల పరిహారం ఇవ్వాలి:సీపీఎం

రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృత్యువాత పడిన కుటుంబాకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేపట్టింది. అంతే కాకుండా క్షత గాత్రులను పరామర్శించేందుకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చిన సీఎం చంద్రబాబును అడ్డగించే ప్రయత్నం చేశారు.అప్రమత్తమైన పోలీసులు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు

డిమాండ్లపై కెవిపిఎస్‌ ఉద్యమం

 భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపర్చడం వల్ల దళితులు ఉద్యోగాలు పొంది కొంతవరకైనా అభివృద్ధి అవుతున్నారు. దీన్ని కూడా అగ్రకుల దురహంకారులు ఓర్వలేక పోతున్నారు. ఇంకెన్నాళ్లు రిజర్వేషన్లు, తీసేయమని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుందని అంటున్నారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు అమలుచేయబోమని పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు ముక్తకంఠంలో చెబుతున్నాయి. కానీ పాలకులు ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కల్గిస్తోంది.

కరువు చర్యలేవీ?

ఆదిలోనే హంసపాదులా ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావం తీవ్రరూపం దాల్చడం ఆందోళనకరం. నిరుటి కరువు, తుపాను ప్రకృతి బీభత్సాలకు నష్టాలపాలైన రైతుల్లో ఈ ఏడాది సకాలంలో నైరుతీ రుతుపవనాల రాక వలన తొలకరి ఆశలు చిగురించాయి. కాగా జూన్‌ మొదటి మూడు వారాల్లో మురిపించిన వర్షాలు అనంతరం మొరాయించి అన్నదాతల ఆనందాన్ని ఆవిరి చేశాయి. ఇరవై రోజులకు పైగా చినుకు కరువై వర్షాకాలంలో ఎండాకాలంలా తయారైంది. అసాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు ఎగబాకడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖరీఫ్‌ సాగు పడకేసింది. వానల కోసం రైతన్నలు మబ్బుల వంక ఎదురు చూస్తున్న విపత్కర పరిస్థితి.

పుష్కర ఘటన బాధాకరం:రాఘవులు

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 26 మంది చనిపోవడం దురదృష్టకర సంఘటన అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అని తెలిపారు. యాత్రికుల సంఖ్యను అంచాన వేసి వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం పుష్కర స్నానం పూర్తయిన అనంతరం అధికారులు చేతులెత్తేయండతో ఈ ప్రమాదం జరిగిందని రాఘవులు అభిప్రాయపడ్డారు.

Pages

Subscribe to RSS - 2015