
రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ అన్నారు. తాను పరామర్శకు రావాల్సి ఉన్నప్పటికీ, తాను వస్తే మళ్లీ తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నందున రావటం లేదని పవన్ వివరణ ఇచ్చారు. తాను లేకపోయినా, తన అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్యం బాధిత కుటుంబాలకు తగిన పరిహారాన్ని ప్రకటించాలని కోరారు. పుష్కరాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. భక్తులు కూడా సంయమనంతో పుష్కరాల్లో పాల్గొనాలని సూచించారు.