మావోయిస్టుల అల్టిమేటం

మన్యంలో బాక్సైట్‌ ఖనిజం వెలికితీతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేస్తూ విశాఖ మన్యంలోని తెలుగుదేశం, బీజీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలకు లేఖలు పంపినట్టు తెలిసింది. ఇవి మావోయిస్టు పార్టీ ఈస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి కైలాసం, మరో నేత లక్ష్మి మన్యం పరిధిలోని మండలాలకు చెందిన పలువురికి అందినట్టు సమాచారం. బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని, ఆ ప్రయత్నాలను విరమించుకుంటున్నట్టు ప్రభు త్వం బహిరంగ ప్రకటన చేసేలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మావోయిస్టులు ఆ లేఖల్లో పేర్కొన్నట్టు తెలిసింది.