హూద్ హూద్ తుఫాన్ లో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

ఈ రోజు విశాఖ ఏజెన్సీ అరుకు MPDO ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె. లోకనాధం మాటలాడుతూ విశాఖ జిల్లాలో హూద్ హూద్ తుఫాన్ వాళ్ళ పడిపోయిన సిల్వర్ ఒక్ చెట్లు తొలగించుటకు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా ఒక సిల్వర్ చెట్టుకు రూ . 100 /-లు చొప్పున ఒక్కొక రైతుకు 150 చెట్లుకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికి చెల్లించకపోవడం దుర్మార్గం.ఒక అరుకు మండలంలోనే 14 పంచాయతీల పరిధిలో 170 గ్రామాల్లో ప్రభుత్వ అధికారులే సర్వ్ జరిపి 2574 మంది రైతులు నష్టపోయారని గుర్తించారు. వీరికి సుమారు 2 కోట్ల 26 లక్షల 98 వేలు పంపిణీ చేస్తామని NREGS, కాఫీ బోర్డ్ అధికారులు ప్రకటించారన్నారు . కానీ నేటికి సిల్వర్ ఒక్ రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే సిల్వర్ చెట్లు తొలగింపుకు డబ్బులు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ..