2015

2జి స్కాంలో కొత్త కోణం..

 2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి న ముడుపుల సొమ్ము సూరత్ మీదు గా స్విట్జర్లాండ్ వంటి పన్నులకు స్వర్గ్ధామైన దేశాలకు తరలిపోయిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తులో వెల్లడయింది. ఈ నిధులను ఆపరేటర్లు చెన్నై నుంచి సూరత్ మీదుగా స్విట్జర్లాండ్ వంటి దేశాలకు తరలించినట్లు రూ. 5,395 కోట్ల విలువ గల హవాలా కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఇడి పరిశోధనలో తేలింది. అహ్మదాబాద్ జోనల్ యూనిట్ ఇడి అధికారులు ఈ నెల ఒకటో తేదీన కోట్లాది రూపాయల హవాలా కుంభకోణంతో సంబంధం ఉన్న దుబాయికి చెందిన వ్యాపారవేత్త మనీశ్ షాను సూరత్‌లో అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రజావ్యతిరేక విధానాలపై ఉధృతంగా ఉద్యమాలు..

ప్రభుత్వ విధానాలతో నష్టపోతున్న వారి సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. విజయవాడ కానూరు పప్పుల మిల్లు సెంటర్‌ శ్రీనివాసా కళ్యాణమండపంలో సిపిఎం కృష్ణాజిల్లా కమిటీ విస్తృత సమావేశం గురువారం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ, రాజధాని ప్రాంత భూముల్లో పంటలు లేకపోవడంతో ఉపాధిపోయి వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించలేం

భారత్‌లో అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించేందుకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తి తన గదిలో కూర్చుని అశ్లీల చిత్రాలు చూడాలనుకునే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాధమిక హక్కును ఎవరూ నిలువరించలేరని నిస్సహాయత వ్యక్తంచేసింది. ''అటువంటి తాత్కాలిక ఆదేశాలను ఈ కోర్టు జారీ చేయలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు కోర్టుకు వచ్చి మైనారిటీ తీరిన వ్యక్తిని నేను, నా గదిలో కూర్చుని నేను చూస్తుంటే మీరెలా నన్ను నిలువరించగలుగుతారు. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రశ్నించవచ్చని'' ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు మౌఖికంగా తెలిపారు.

టిడిపి ప్రభుత్వ ఏడాది పాలన నిర్వాకం

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆందోళనలు చెయ్యకూడదట. వీధుల్లోకి రాకూడదట. ఏం చేసినా కుక్కినపేనులా పడుండాలట. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మహానాడులో తీర్మానాన్నే ఆమోదించింది. అంగన్‌వాడీ, ఐకెపి ఉద్యోగులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అతీగతీ లేదు.
          సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు జూన్‌ 29, 30 తేదీలలో విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితి, సంక్షేమ పథకాలు, వాగ్దానాల అమలు, కార్మికుల, ఉద్యోగుల స్థితిగతులు, వాటిపట్ల ప్రభుత్వ తీరును సమావేశం సమీక్షించింది. దాని పూర్తి పాఠం.....

ఉర్దూ పట్ల నిర్లక్ష్యం తగదు

భారతదేశం గుర్తించిన రెండవ అధికార భాష అయిన ఉర్దూను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఇంగ్లీషు తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష ఉర్దూ. కావున ఉర్దూనే మరింత అభివృద్ధి చేయాలి. అయితే ఉర్దూ భాష ఎక్కువగా ముస్లింలకే అనే ముద్రపడింది. కానీ ఉర్దూ అంతర్జాతీయ భాష. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం జపనీస్‌ భాషను కోర్సుగా పెట్టి నేర్పించాలని ప్రయత్నిస్తున్నది. కానీ ఇప్పటికే వాడుకలో ఉన్న ఉర్దూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. గతంలో ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉండేది. కానీ నేడు ముస్లిం సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఉర్దూ పాఠశాలలు అధికంగా ఏర్పాటు చేశారు.

ఏచూరి లండన్ పర్యటన

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లండన్‌ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. అక్కడ ఆయన వరుసగా జరిగే పలు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నెల 11వ తేదిన అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కమ్యూనిస్ట్స్‌ అండ్‌ ఇండియన్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌, గ్రేట్‌ బ్రిటన్‌ నిర్వహించనున్న రెండు సమావేశాల్లో పాల్గొంటారు. 12వ తేదిన అదే సంస్థ, సిపిఐ, ఇతర వామపక్ష ప్రజాతంత్ర సంస్థల మిత్రుల సహకారంతో నిర్వహించబోయే పౌర సన్మానంలో పాల్గొంటారు. బ్రిటన్‌లో పర్యటించే సమయంలో సిపిఎం, ఇతర వామపక్షాల మద్దతుదారులు నిర్వహించే పలు కార్యక్రమాలు, సంఘీభావ సదస్సుల్లో ఏచూరి పాల్గొంటారు. 

చౌహాన్‌ రాజీనామాకై 16న రాష్ట్ర వ్యాప్త సమ్మె

వ్యాపమ్‌ కేసులో నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరగడానికి వీలుగా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై ఒత్తిడి పెంచేందుకు జూలై 16న మధ్య ప్రదేశ్‌లో సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో కలసి రావాల్సిందిగా సోదర వామపక్ష పార్టీలకు, ఇతర ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. పార్టీ సీనియర్‌ నేత మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ పీపుల్స్‌ డెమొక్రసీ తాజా సంచికలో రాసిన సంపాద కీయంలో ఈ మేరకు పిలుపు నిచ్చారు.

రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

కృష్ణా: ముసునూరు తహశీల్దార్ పై దాడికి నిరసనగా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

నేటి నుండి మున్సిపల్‌ సమ్మె

మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 9వ తేదీ అర్ధరాత్రి నుండి మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మె బాట పట్టనున్నట్లు మున్సిపల్‌ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ(జెఎసి) నాయకులు తెలిపారు. పాతబస్తీలోని ఎఐటియుసి కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ వర్కర్ల యూనియన్‌(ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రంగనాయకులు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డేవిడ్‌, ఇతర జెఎసి నాయకులు సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు.

సమ్మె నివారించాలి

వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్లబోతున్నారు. ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా మున్సిపల్‌ కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను నివారించే మార్గం చూడాలి. అసలే వర్షాకాలం. మామూలుగానే దోమల ద్వారా, గాలి ద్వారా రోగాలు వ్యాపించే కాలం. దీనికి తోడు సమ్మె వలన అంటువ్యాధులు విజృంభిస్తే ఆ పాపం ప్రభుత్వానిదే అవుతుంది. మున్సిపల్‌ కార్మికులు ఒక రోజు విధులను బహిష్కరిస్తేనే రాష్ట్రం చెత్త కుప్పగా మారుతోంది.

Pages

Subscribe to RSS - 2015