2015

మసకబారుతున్న మోడీ ''ప్రభ''

2013, 2014 సంవత్సరాల్లో 'హర, హర మోడీ' నినాదాలు దేశంలో మిన్నంటాయి. బిజెపిపై మోజుకంటే కాంగ్రెస్‌కు పట్టిన బూజు చూసి జనం (31 శాతమే) బిజెపికి ఓటేశారు. 'జనం' అంటే ఏ జనం అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అంబానీలు, అదానీల గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. సంవత్సరంలో మోడీ తిరిగిన 18 దేశాలకూ దేశంలోని పెట్టుబడిదారులను వెంటేసుకుని వెళ్ళారు. ఆస్ట్రేలియా, మంగోలియాకు అదానీని ప్రత్యేకంగా తీసుకెళ్ళారు. అందుకే అనుకుంటా ఆ బృందంలోని సభ్యుల వివరాలు ఇవ్వమని ఆర్‌టిఐ కింద అడిగినా ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఏమైనా, ఈ పెట్టుబడిదారుల 'బృందం' ఎన్నికల ముందూ బలపరిచారు. ఇప్పుడూ బలపరుస్తున్నారు.

పార్టీల గుండెల్లో రైళ్లు

సుప్రీం కోర్టు రాజకీయ పార్టీలను ఎక్కడ సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తుందోనన్న భయంతో నాయకులు గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తే కాంగ్రెస్,బిజెపి తదితర జాతీయ పార్టీలతో పాటు టిఆర్‌ఎస్, తెలుగుదేశం, అన్నా డిఎంకె, డిఎంకె, సమాజ్‌వాదీ, ఆమ్‌ఆద్మీ లాంటి మెజారిటీ ప్రాంతీయ పార్టీల ఆర్థిక రావాదేవీలన్నీ బట్టబయలవుతాయి. అందుకే ఆయా పార్టీల నాయకుల గుండెల్లో గుబులుపుట్టింది.

ప్రభుత్వరంగంతోనే సాధ్యం

భారతదేశ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలతోనే సాధ్యమని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. సోమవారం రాత్రి ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో స్టీల్‌ సిఐటియు ఆధ్వర్యాన 'సేవ్‌ ప్లబిక్‌సెక్టర్‌-సేవ్‌ ఇండియా' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తపన్‌సేన్‌ మాట్లాడుతూ.. భారత స్వాతంత్రోద్యమం ద్వారా బ్రిటీష్‌ పాలకులను వెళ్లగొట్టగలిగినా, వారి విధానాలను మాత్రం మన పాలకులు అనుసరిస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వం ఈ విధానాలను మరింత వేగంగా అమలుచేస్తోందన్నారు.

సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మె..

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు రెండో తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ జిల్లా ప్లీనం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, సమ్మెను పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెకు బిజెపి అనుబంధ సంస్థ అయిన బిఎంఎస్‌ కూడా మద్దతిస్తోందని చెప్పారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఆగస్టు ఒకటో తేదీ నుంచి 14వతేదీ వరకు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రధానంగా పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతిపై లెఫ్ట్‌ సమరం

బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థాయిలో చోటుచేసుకుంటున్న  అవినీతిని ఎండగట్టేందుకు వామ పక్షాలు సమరశంఖం పూరించాయి. ఈ నెల 20న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని ఆరు వామపక్ష పార్టీలు నిర్ణయిం చాయి. అవినీతి, ఆశ్రితపక్షపాతంలో కూరుకుపోయిన మంత్రు లను తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయంలో సిపిఐ, సిపిఐఎంఎల్‌-లిబరేషన్‌, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌(ఎఐఎఫ్‌బి), ఎస్‌యుసిఐ(సి), ఆరెస్పీ నేతలు సమావేశమయ్యారు.

కార్పొరేట్ల నుంచి దేశ రక్షణే లక్ష్యం

   దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల నుంచి రక్షించి ప్రభుత్వరంగాన్ని కాపా డటమే సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌యూనియన్లు తలపెట్టిన సమ్మె లక్ష్యమని సిఐటియు ఆలిండియా ప్రధానకార్యదర్శి తపన్‌సేన్‌ ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ 'మేకిన్‌ ఇండియా' పేర దేశ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ వినాశనమే మోడీ, బిజెపి ధ్యేయమన్నారు.

ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?

 బిజెపి భీష్మాచార్యులు లాల్‌కృష్ణ అద్వానీ ''మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయని'' తన భయాన్ని పైకి వ్యక్తీకరించి, కొందరి మనసులనున్న, బయటకు రాని భయాన్ని ఆవిష్కరించారు. ''ఇప్పుడు మనం ప్రజాస్వా మ్యంలోనే ఉన్నామా?'' అసలు ప్రజాస్వామ్యమంటే ఏమిటీ? అనే ఇంకో ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ''అద్వానీ ఆ మాట ఎందుకన్నారు? రాబోయే చీకటి రోజుల చిహ్నాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఎలా అంచనా వేయగలిగారు? అన్నిటికీ సమాధానాలు అవసరమే!

ప్రకృతి గతితర్కం

 పురాతన కాలంనాటి అద్భుతమైన స్వాభావిక తాత్విక ఊహలు, అరబ్బుల కాలంలో అడపాదడపా చోటు చేసుకున్న మహావిష్కరణలు ఎక్కువభాగం ఎలాంటి ఫలితాలు ఇవ్వకుండానే అంతర్ధానమైపో యాయి. ప్రకృతిని ఆధునికంగా పరిశోధించి సాధించిన శాస్త్రీయమైన, క్రమబద్ధమైన పరిపూర్ణమైన శాస్త్రీయాభివృద్ధి మాత్రమే కాల పరీక్షకు నిలిచింది. ఈ ఆధునిక శాస్త్ర పరిశోధనాకాలంనుండి ఒక నూతన శకం ఆరంభమయ్యింది. ఇదంతా అతి సమీప చరిత్రయే. జర్మన్లు ఈ శకాన్ని సంస్కరణ యుగంగా పిలుచుకుంటే, ఫ్రెంచి వారు పునరుజ్జీవనశకంగా పిలుచుకున్నారు. ఇటలీవారు సంగీత, సాహిత్యాలు, కళలు, కుడ్యాల నిర్మాణంలో అద్భుత ప్రగతిసాధించిన కాలంగా పేర్కొన్నారు.

గ్రీస్‌ పరిస్థితిపై అత్యవసర భేటీ

ఆర్థిక సంస్థల షరతులకు 'నో' చెప్పిన గ్రీస్‌ తాజా పరిస్థితిపై చర్చించేందుకు యూరో జోన్‌ దేశాల నేతలు మంగళవారం ఇక్కడ అత్యవసర భేటీ నిర్వహించారు. రిఫరెండం ఫలితాలతో బలం పుంజుకున్న గ్రీస్‌ ప్రధాని అలెక్సిస్‌ సిప్రాస్‌ ఆర్థిక సంస్థలతో చర్చలకు కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. గత సోమవారం నుండి కొనసాగుతున్న బ్యాంకుల మూసివేతను గ్రీస్‌ ప్రభుత్వం గురువారం వరకూ పొడిగించటం, ఎటిఎంలలో నగదు నిల్వలు అడుగంటటం వంటి పరిస్థితుల నేపథ్యంలో బెయిలవుట్‌ చర్చల పునరుద్ధరణకు సిప్రాస్‌ నుండి తాజా ప్రతి పాదనలను ఆహ్వానించేందుకు సిద్ధమ య్యారు.

నేటినుండి బ్రిక్స్‌ సదస్సులు

బుధవారం నుండి రష్యాలో ప్రారంభం కానున్న బ్రిక్స్‌ దేశాల కూటమి సదస్సు, షాంఘై సహకార సంస్థ సదస్సు సానుకూల ఫలితాల సాధనపైనే దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంక్‌ (ఎఐఐబి) ఏర్పాటు వంటి అంశాలతో పాటు ఇప్పటి వరకూ చర్చలకు మాత్రమే పరిమితమైన ఈ రెండు వ్యవస్థలు సకారాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. రష్యాలోని ఉఫాలో ప్రారంభం కానున్న బ్రిక్స్‌ గ్రూప్‌ దేశాల సదస్సులో ఎఐఐబి ఏర్పాటు, అత్యవసర రిజర్వ్‌ ఏర్పాటు వంటి అంశాలను చైనా ప్రధానంగాచర్చకు తెనున్నట్టు తెలుస్తుంది.

Pages

Subscribe to RSS - 2015