నేటినుండి బ్రిక్స్‌ సదస్సులు

బుధవారం నుండి రష్యాలో ప్రారంభం కానున్న బ్రిక్స్‌ దేశాల కూటమి సదస్సు, షాంఘై సహకార సంస్థ సదస్సు సానుకూల ఫలితాల సాధనపైనే దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంక్‌ (ఎఐఐబి) ఏర్పాటు వంటి అంశాలతో పాటు ఇప్పటి వరకూ చర్చలకు మాత్రమే పరిమితమైన ఈ రెండు వ్యవస్థలు సకారాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. రష్యాలోని ఉఫాలో ప్రారంభం కానున్న బ్రిక్స్‌ గ్రూప్‌ దేశాల సదస్సులో ఎఐఐబి ఏర్పాటు, అత్యవసర రిజర్వ్‌ ఏర్పాటు వంటి అంశాలను చైనా ప్రధానంగాచర్చకు తెనున్నట్టు తెలుస్తుంది. బ్రిక్స్‌ సదస్సుతో పాటు ఎస్‌సిఓ సభ్యదేశాల 15వ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు సీ జింగ్‌పింగ్‌తో పాటు ఏడు దేశాల అధినేతలు హాజరవుతారని వివరించారు.షాంఘై సహకార సంస్థలో భారత్‌, పాకిస్తాన్‌లు కూడా సభ్యదేశాలుగా చేరనున్నాయని ఆయన చెప్పారు