
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లండన్ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. అక్కడ ఆయన వరుసగా జరిగే పలు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నెల 11వ తేదిన అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిస్ట్స్ అండ్ ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, గ్రేట్ బ్రిటన్ నిర్వహించనున్న రెండు సమావేశాల్లో పాల్గొంటారు. 12వ తేదిన అదే సంస్థ, సిపిఐ, ఇతర వామపక్ష ప్రజాతంత్ర సంస్థల మిత్రుల సహకారంతో నిర్వహించబోయే పౌర సన్మానంలో పాల్గొంటారు. బ్రిటన్‌లో పర్యటించే సమయంలో సిపిఎం, ఇతర వామపక్షాల మద్దతుదారులు నిర్వహించే పలు కార్యక్రమాలు, సంఘీభావ సదస్సుల్లో ఏచూరి పాల్గొంటారు.