రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు : బాబు

తప్పు చేసిన వారు ఎవ్వరైనా వదిలిపెట్టే సమస్య లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం పలువురు కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు అనంతర మీడియాతో మాట్లాడుతూ..తాను జులై 5న జపాన్‌కి వెళ్లి 9న సాయం త్రం ఢిల్లీకి చేరుకున్నానని, ఏపీకి పెట్టుబడులే ముఖ్యద్ధేశ్యంగా తాను జపాన్‌లో అనేక మంది మంత్రులను, ప్రభుత్వ సంస్థలని, ప్రైవేటు వ్యక్తులని కలిశానని వారందరూ పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే 7 ప్లాంట్‌లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఆయా ప్లాంట్‌లనుంచి ఏడాదికి 200 నుంచి 1000 మెట్రిక్‌ టన్నులు....ఒక్కో మెట్రిక్‌ టన్నుకు గాను 8నుంచి 9 కోట్లు ఖర్చువుతుందని తెలిపారు. ఈప్రాజెక్టుల న్నీ పూర్తిగా ప్రైవేటు వ్యక్తులే నిర్వహిస్తారని, దాని ద్వారా తయారయ్యే విద్యుత్‌ తారిఫ్‌ ప్రకారం విక్రయిస్తారని చెప్పారు. రాష్ట్రంలో పవర్‌, లాజిస్టిక్‌,వాటర్‌,ఆక్వా, హాస్పిటాలిటీ, స్పోర్ట్స్‌ యూనివర్శీటీలను నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పియూష్‌గోయల్‌తో తాజ్‌మాన్‌సింగ్‌ హోటళ్లో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రంలో 24 గంటల కరెంటు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లా మని.. అలాగే సోలార్‌ పవర్‌ విధివిధానాలను చర్చించామని పేర్కొన్నారు.ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సోలార్‌ ఎనర్జీ వల్ల రాష్ట్రంలో దాదాపు 35శాతం కరెంటు పొదుపు అవుతుందని ఈసందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికీ 5లక్షల ఇళ్లకు కరెంటు లేదని...వచ్చే నెల మార్చి కల్లా కల్పిస్తామని తెలియజేశారు. మొత్తం విద్యుత్‌ వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అనంతరం రాష్ట్రం నూతన రాజ ధాని భూసేకరణలో అటవీ భూములు ఎక్కువశాతం ఉండటంతో అనుమతులు కొరకు కేంద్ర పర్యావరణ మరియు అటవీశాఖ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ని ఆయన కార్యాలయం ఇందిర పర్యావరణ భవన్‌లో సమావేశమైయ్యారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ ..కేంద్రం తరుపున త్వరగతిన అనుమతులు ఇచ్చేం దుకు ప్రయత్నిస్తున్నామని విలేకర్లకు చెప్పారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ని ఆయన నివాసంలో భేటీ అయిన చంద్రబాబు సెక్షన్‌8, ఇతర అంశాలపై చర్చించామన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత హోంమంత్రి దేనని ఈసందర్బంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో నదుల అనుసందానం...అంతరాష్ట్ర జల వివాధాలపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతీతో ఆమె కార్యాల యంలో సమావేశమయ్యారు. అలాగే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఒడిగడుతున్నారని....ఆయనకు ఆహాక్కు ఎవ్వరిచ్చారని ప్రశ్నించారు. ఏక పక్షంగా ఆయన నిర్ణయాలు చేయకూడదని హితవు పలికారు. కృష్ణ బోర్డు నీటి పంపకం చేసిన కేంద్రం వాటిని అమలు చేయాలని మంత్రిని చంద్రబాబు కోరారు. ఆమె త్వరగతిన అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రెండు రాష్ట్రాలలో నెలకొన్న సమస్యలపై సయోద్య బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌, వైసీపీలు రాష్ట్రం అభివృద్ధి కాకూడదనే ఆలోచనలో వున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోతుందని... ప్రభు త్వానికి ఆదాయం రాకుండా ఇసుక లూటీ అవుతుందని, ఆలూటీ చేసేవారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎమ్మార్‌ఓ పైదాడి ఘటనపై ఎమ్మెల్యే చింత మనేని పై చర్యలు ఎందుకు తీసుకోలేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పష్టత ఇవ్వ కుండా...ఏంజరిగిందో తెలుసుకుంటానని తెలిపారు. నేను ఎవ్వరికీ బయప డనని.. తప్పు చేసిన వారెవరైనా ఎవ్వరినీ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అక్టోబర్‌2న నూతన రాష్ట్ర రాజధాని శంకుస్థాపనికి సింగపూర్‌, జపాన్‌ ప్రధాన మంత్రులతో పాటు...ప్రధానినరేంద్ర మోదీకి ఆహ్వానించామని, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసిపుష్కరాలకు ఆహ్వానించామని మరో మాటకు సమాదాన మిచ్చారు. - See more at: http://vaartha.com/node/1682#sthash.vU6Ec0u8.dpuf