భారత్ కు పాక్ అణుహెచ్చరిక..

రక్షణ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగించడానికి వెనుకాడమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తెలిపారు. పాక్ చానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన కుండబద్దలు కొట్టారు. ‘మమ్మల్ని రక్షించుకోవడానికి అణుబాంబులు మాకున్న అవకాశాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం మేం ఉంచుకోవడం లేదు. అయితే ఆ అవసరం ఎప్పటికీ రాకూడదని మేం భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాం. కానీ మాకే ప్రమాదం వస్తే ఉపేక్షించేది లేద’ని పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదం పేట్రేగిపోతుండడం.. భారత్‌‌తో పరోక్ష యుద్ధానికి దారి తీయొచ్చని చెప్పారు.