2015

కార్మిక హక్కుల దీక్షా దినం మేడే

కార్మికుల హక్కుల దీక్షా దినం మేడే, రచన, కూర్పు: పిళ్లా కుమార స్వామి,
పేజీలు: 56, వెల 53/-,
ప్రతులకు: జి.లక్ష్మీదేవి, 28/3/394, శారద నగర్‌, అనంతపురం. మరియు ప్రజాశక్తి, విశాలాంధ్ర, దిశ బుకహేౌస్‌ అన్ని బ్రాంచీలు.

ఓటుకు నోటు ఎఫ్‌ఐఆర్‌లో బాబు పేరు నమోదు చేయాలి : పి.మధు

ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. బుధవారం కడపలోని సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలం తక్కువగా ఉన్నప్పటికీ అధికారం, డబ్బు వినియోగించి ఎన్నికల్లో గెలవాలని టిడిపి యత్నిస్తోందన్నారు.

ప్రాంతీయవాదం-ప్రజలపై భారం..

             కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏడాది పాలన పూర్తియిందంటూ సంకలు గుద్దుకుంటున్న రాష్ట్ర పాలకుల తీరు సంతోషంలో చావు మరిచిపోయి నట్లున్నది. రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 13 జిల్లాల ప్రజలపై, గడిచిన సంవత్సర కాలంలో వందల కోట్ల రూపాయల భారం మోపిన విషయం పాలకులకు గుర్తురావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు జరపడం లేదు. చెయ్యని వాగ్దానాలు అమలు జరుపుతున్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పూర్తిగా అమలు జరపలేదు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాయితీల పేరుతో వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు.

చాప కింద నీరులా నియంతృత్వం..

        పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్‌. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.

Pages

Subscribe to RSS - 2015