కార్మిక హక్కుల దీక్షా దినం మేడే

కార్మికుల హక్కుల దీక్షా దినం మేడే, రచన, కూర్పు: పిళ్లా కుమార స్వామి,
పేజీలు: 56, వెల 53/-,
ప్రతులకు: జి.లక్ష్మీదేవి, 28/3/394, శారద నగర్‌, అనంతపురం. మరియు ప్రజాశక్తి, విశాలాంధ్ర, దిశ బుకహేౌస్‌ అన్ని బ్రాంచీలు.
                    కుల, మతాలు, ప్రాంతాలు, దేశాలు, ఖండాలకు అతీతంగా అంతర్జాతీయంగా, విశ్వ శ్రామిక జనులు ఐక్యంగా కర్తవ్య సాధనకై కార్మిక వర్గం జరుపుకునే పండుగ -దీక్షాదినమే ''మేడే''. సమస్త సరుకులు శ్రమ జనితాలే అని మార్క్స్‌ నిరూపించాడు. 167 సంవత్సరాల చరిత్ర! మార్క్స్‌ -ఏంగెల్స్‌ రాసిన ''కమ్యూనిస్టు ప్రణాళిక'' కు ముందే కార్మిక వర్గం తమ బాధలపై పోరాటం చేశారు. వర్తమానాన్ని మార్చే ప్రయత్నం చేశారు. శ్రమ జీవులకు సిద్ధాంత ఆయుధాన్ని ఇచ్చింది. మార్క్సిజం. ''పోరాడితే పోయేది ఏమీ లేదు. బానిస సంకెళ్ళు తప్ప'' అని మార్క్స్‌్‌-ఎంగెల్స్‌ నిరూపించారు. చికాగోలో 8 గంటల పనివేళలకై జరిగిన కార్మిక సమ్మె. సమ్మె అంటే కార్మికుల చేతిలోని చివరి ఆయుధం అని... అది అనేక అనుభవాలను నేర్పే గొప్ప పాఠశాల అని లెనిన్‌ అంటారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఫలాలు సమాజాభివృద్ధితో పాటు శ్రామికులకు ఉపయోగపడాలి. కాని పెట్టుబడి దారీ వ్యవస్థలో శ్రామికులపై దోపిడీ తీవ్రతకు అవి సాధానాలుగా మారాయంటారు. చిత్తబ్రత మజుం దార్‌,పిళ్ళా కుమారస్వామి, ఎస్‌.వీరయ్య, లక్ష్మీ నరస య్య, లెనిన్‌ వ్యాసాలు... రాంభట్ల, తెలకపల్లి రవి, శ్రీశ్రీ పాటలు చికాగో అమరవీరుల ముఖ చిత్రం, ఆగస్ట్‌ స్పైస్‌, జార్జి ఏంగిల్స్‌, ఆడాల్ఫ్‌ ఫిషర్‌, అల్సర్స్‌ పార్సన్స్‌ ముఖ చిత్రాలు ఈ పుస్తకం పవిత్రతను త్యాగ స్ఫూర్తిని నింపాయి. 1806లో అమెరికాలోని కార్మికుల తిరుగుబాట్లు, 1864 అక్టోబర్‌, అమెరికా, కెనడా ఆర్గనైజ్‌డ్‌ లేబర్‌ యూనియన్ల 4వ మహాసభ, 1886 మే నుండి 8 గంటల పనికై పిలుపు..మే 1 సమ్మె 25 లక్షల మంది సమ్మెలో ప్రవేశించడం. ఒక్క చికాగోలోనే 4 లక్షల మందితో సమ్మె, 1886 మే 4 తేదిన ''హే'' మార్కెట్‌ ప్రదర్శన- కాల్పుల్లో కార్మికుల అమరత్వం! పాలక వర్గాలకు అండగా నిల్చిన న్యాయస్థానం. కార్మికులకు నేతృత్వం వహించిన అల్సర్స్‌ పార్సన్స్‌, ఆగస్ట్‌ స్తైస్‌, అడాల్ఫ్‌ ఫిషర్‌, జార్జి ఎంగిల్స్‌, స్పైస్‌లను 1887 నవంబర్‌ 11న ఉరి తీశారు. రష్యా, బ్రెజిల్‌, ఐర్లాండ్‌, చైనా1920, ఇండియాల్లో1927 మేడే ప్రదర్శనలు, 2004లో ఇంగ్లాండులో మే 1 ప్రదర్శనపై పోలీసు జులుం 1826లో హౌరా కార్మికుల (రైల్వే) సమ్మె, చికాగో స్మృతి చిహ్నం ఏర్పాటు, కార్మిక ప్రముఖుల ప్రవచనాలు, నేటి దేశ పరిస్థితులు ప్రపంచీకరణకు దెబ్బ తిన్న దేశాలు అసంఘటిత కార్మిక రంగ స్థితి, లాంటి అంశాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారు.

- తంగిరాల చక్రవర్తి