2015

బిజెపి దిగజారుడుతనం

కాదేదీ విద్వేషానికి అనర్హం అని గట్టిగా భావించే బిజెపి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సైతం దీనికి వాడుకోవాలని చూడడం జుగుప్సాకరం. యోగా డే వేడుకల్లో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఎందుకు పాల్గొన లేదో సమాధానమివ్వాలని బిజెపికి డెప్యుటేషన్‌పై వచ్చిన ఆరెస్సెస్‌ ప్రచారక్‌ రామ్‌ మాధవ్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించడం, ఆయన లేకితనాన్ని బయటపెట్టింది. ఆయన ట్వీట్‌కు మద్దతుగా సంఫ్‌ు పరివార్‌ సైబర్‌ యోధులూ విజృంభించడంతో ఆ వార్త క్షణాల్లో దేశమంతటికీ పాకింది. ఇది నిజమే కాబోలు అని అనుకునేలా ఈ గోబెల్స్‌ ప్రచారం సాగింది.

బడి నవ్వుతోంది..!

కార్పొరేట్‌, ప్రయివేటు కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ జీవో నెం.1(94) ప్రకారం యాజమాన్య కమిటీలు నియమించాలి. అధిక ఫీజుల తగ్గింపు, విద్యా ప్రమాణాల పెంపుదల, కనీస సౌకర్యాలు ఏర్పాటు విషయం ఆ కమిటీల్లో చర్చించి నిర్ణయాలు చేయాలి. ప్రజా ప్రతినిధులు తలో ఒక ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్‌ స్కూల్‌గా చేయటానికి దత్తత తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్‌, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలనూ, ఐటిఐలనూ నేటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాలలో గురుకుల పాఠశాలలు ప్రారంభించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలను ఒక కిలోమీటరు పరిధిలో ఏ స్కూలుఉందో దానిలో చేర్పించుకోవాలి. ఏదో ఒక బడిలో చేర్చాలి.

నూతన మద్యం విధానంపై నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని నిరసిస్తూ మంగళవారం విజయవాడ బీసెంట్‌ రోడ్డులో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మద్యం భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 'నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలి, వద్దు వద్దు మద్యాంధ్రప్రదేశ్‌, మంచినీరు నిల్‌-మద్యం పుల్‌' అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.ముందుగా సిపిఎం నగర కార్యాలయం నుంచి ఆందోళనకారులు ప్రదర్శనగా బీసెంటర్‌ రోడ్డులోని అన్సారీపార్కు వద్దకు చేరుకున్నారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

అంబేద్కర్‌ వారసత్వం

మేధావి మరియు సామాజిక విప్లవ కారుడు అయిన డా|| బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా మరీ ముఖ్యంగా హిందూ మితవాదులు ఆయనను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆయన చేసిన కృషి, వారసత్వంపై ఒక అంచనా.

Pages

Subscribe to RSS - 2015