హుదూద్ పరిహారం ఇంతవరకూ అందలేదంటూ విశాఖ జిల్లా చీడికాడలోని ఎస్‌సి కాలనీ మహిళలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను నిలదీశారు. మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలంలో సోమవారం జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ ఇబ్బదులను లోకేష్‌కు వివరించారు. ఎస్‌సి కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయలేదని, గ్రామ సమీపంలో బంజరు భూముల పట్టాలను తమకు ఇవ్వలేదని, రేషన్‌కార్డులు, పింఛన్లు, మరుగుదొడ్లు వంటి సమస్యలపై పట్టించుకునే నాథుడే లేడని నిరసన వ్యక్తం చేశారు.