సిపిఐ కురువృద్ధుడు ఎ.బి.బర్థన్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్య నిపుణులు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున మెదడులో రక్తనాళాలు చిట్లి గడ్డకట్టుకు పోవడంతో ఇక్కడి జిబి పంత్ ఆసుపత్రికి వెంటనే తరలించారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. మరో 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద వుంచారు. మెదడు కుడివైపు భాగంలో సుమారు యాభై శాతం వరకు రక్తం గడ్డకట్టింది. ఎడమ వైపు శరీరం పూర్తిగా చచ్చుబడిపోయి పక్షవాతం వచ్చింది. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇది మూడోసారి.