2015

GSTపైఅఖిలపక్ష్యంవేయాలి:ఏచూరి

రాష్ట్రాల ఆర్థిక అధికారాలపై తీవ్ర ప్రభావం చూపనున్న జిఎస్‌టి బిల్లు విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.  రాష్ట్రాల సేల్స్‌టాక్స్‌ను కేంద్రం తమ గుప్పెట్లోకి తీసుకునే జిఎస్‌టి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. దేశంలో 50 శాతం కంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. అందుకే ఆయా రాష్ట్రాలతోనూ, అన్ని పార్టీలతోనూ కేంద్రం మాట్లాడాలని తాము కోరుతున్నామన్నారు.

రాహుల్‌పై కేజ్రి ట్వీట్..

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు కురిపించారు. దిల్లీలో రైల్వే స్థలాల ఆక్రమణల తొలగింపుపై ఆప్‌ ఎందుకు పార్లమెంటు వద్ద గొడవ చేస్తోంది.. ఢిల్లీలో అధికారంలో ఉంది వారే కదా అని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ విమర్శించారు. 'రాహుల్‌ చిన్నపిల్లాడు.

బెజవాడలో TS సిఎం KCR

చంద్రబాబుతో కెసిఆర్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశం గంటన్నరపాటు కొనసాగింది. తిరిగి విజయవాడ నుండి కెసిఆర్‌ హైదరాబాద్ బయల్దేరారు. ఆయుత చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కెసిఆర్‌ విజయవాడ చంద్రబాబు ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.

కాల్‌మనీపై బాబుకు జగన్‌ లేఖ..

కల్‌మనీ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు వైఎస్‌ఆర్పీ అధినేత జగన్‌ లేఖ రాశారు. కాల్‌మనీ దందా టిడిపి అండచూసుకునే కొనసాగుతుందని దీనికి చంద్రబాబు అండ చూసుకునే రాక్షసకాండ కొనసాగిస్తున్నరని తెలిపారు. వైఎస్‌ఆర్పీ, కాంగ్రెస్‌ వామపక్షాలకు కాల్‌మనీ బురద అంటగడుతున్నరని ప్రభుత్వమే మాఫియాగా మారడం ఇప్పుడే చూస్తున్నామని ఆయన తెలిపారు.

విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం..

రాజమండ్రిలో సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి. మధు హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు.పార్టీ పటిష్టత కోసం విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరముందన్నారు. 

భూసేకరణకు వ్యతిరేకంగా సదస్సు..

భూసేకరణ పేరుతో బలవంతంగా రైతులనుంచి భూమి సేకరించడాన్ని సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తీవ్రంగా వ్యతిరేకించారు.సిపిఎం రాష్ట్ర ప్లీనం సందర్బంగా రాజమండ్రిలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు .. అభివృద్ధి ముసుగులో భోగాపురం ఎయిర్‌పోర్టు, బందరు పోర్టు, సోలార్‌ పార్కుల పేరుతో ఏపీ సర్కారు భూమిని లాక్కుంటోందని ఆరోపించారు..

కాంగ్రెస్‌కు బాసటగా నితీష్..

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌కుబీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బాసటగా నిలబడ్డారు. రాజకీయాల్లో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు వుండరాదని అన్నారు. ప్రతిపక్షాలను ఇలా వేధింపులకు గురిచేయరాదని సూచించారు. పార్లమెంట్‌ వెలుపల గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమపై కక్ష తీర్చుకోవడం కోసమే కేంద్రం ఈడీ అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ కాంగ్రెస్‌ చేసిన విమర్శలపై స్పందించమని కోరగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేపై ఆందోళన..

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. మండల పదరిధిలోని గూడెపువలస వచ్చిన అధికారులను గ్రామ స్తులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు రెచ్చిపోయారు. రైతులను, మహిళలను, వారికి అండగా ఉన్న సిపిఎం నాయకులతో కలిపి 50 మందిని అరెస్టు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం హైకోర్టులో ఎయిర్‌పోర్టుపై న్యాయవిచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు సర్వేలు చర్చనీయాంశంగా మారాయి. కోర్టు తీర్పు వచ్చే వరకూ అగాలని రైతులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. అడ్డుకుంటే అరెస్టులు చేసైనా సర్వే చేస్తామని అధికారులు హెచ్చరించారు.

కల్తీ మద్యం బాధితులను పరామర్శ ..

విజయవాడలో కల్తీ మద్యం మరణాలపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. మెజిస్టీరియల్‌ విచారణ వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ మద్యం విధానంపై కమిషన్‌ నియమించాలని సూచించారు. విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో మద్యం సేవించి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, విజయవాడ నగర కార్యదర్శి డి.కాశీనాథ్‌తో కలిసి మధు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యాన్ని ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించటం శోచనీయమన్నారు.

Pages

Subscribe to RSS - 2015