నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కుబీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బాసటగా నిలబడ్డారు. రాజకీయాల్లో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు వుండరాదని అన్నారు. ప్రతిపక్షాలను ఇలా వేధింపులకు గురిచేయరాదని సూచించారు. పార్లమెంట్ వెలుపల గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమపై కక్ష తీర్చుకోవడం కోసమే కేంద్రం ఈడీ అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలపై స్పందించమని కోరగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.