పార్లమెంట్లో హెరాల్డ్ కేసు రగడ

బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పెట్టిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు కోర్టుకు హాజరవ్వాల్సిందేనంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేయటంతో ఈ కేసుపై రాజకీయ దుమారం చెలరేగింది. తమ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ మంగళవారం పార్లమెంటును స్తంభింపజేసింది. అవి నిరాధార ఆరోపణలని తిరస్కరించిన ప్రభుత్వం.. సోనియా, రాహుల్‌లు విచారణను ఎదుర్కోవాలని సూచించింది. కేసు విషయంలో కాంగ్రెస్ చాలా జవాబులు చెప్పాల్సి ఉందంటూ.. పార్లమెంటును అడ్డుకోవటానికి బదులుగా బుధవారం ఈ అంశంపై చర్చ జరపటానికి సిద్ధమా అని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సవాల్ చేశారు.