వృద్ధిరేటు భూటకం:సిపిఎం

మోడీ ప్రభుత్వం అవాస్తవిక అంకెలతో వృద్ధి రేటును పెంచి చూపుతోందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.మౌలిక ఆర్థిక సూచీలన్నీ నేల చూపులు చూస్తుంటే వృద్ధి రేటు పెరిగినట్లు చూపడంలో అర్థం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థ బేషుగ్గా వుందని చెప్పడం ప్రపంచ పతాక స్థాయి శీర్షికలకెెక్కేందుకు ఉపయోగపడవచ్చునేమో కానీ, ఆర్థిక వ్యవస్థ మూలాల పటిష్టతకు ఏమాత్రమూ తోడ్పడేది కాద న్నారు. మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని, మున్ముం దు మరింతగా వెలిగిపోయే అవకాశాలున్నాయంటూ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి పదే పదే ఊదరగొడుతున్నా రని, నిజానికి ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగకుండా ఇది సాధ్యం కాదని ఏచూరి పేర్కొన్నారు.