హిందూ, ముస్లిములు సఖ్యతగా మెలగాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బీజేపీ మతం పేరుతో పబ్బం గడుపుకుంటోందని మధు విమర్శించారు. మతసామరస్యంపై ఆవాజ్ ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ జరిగింది.