2015

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అవశ్యం..

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 1950 జనవరి 26న రాజ్యాంగ సభలో మాట్లాడుతూ మనం వైరుధ్యాలతో కూడిన జీవితం ప్రారంభిస్తున్నాము. మనకు రాజకీయాలలో సమానత్వం ఉంది కానీ, సామాజిక, ఆర్థిక జీవితాలలో అసమానతలున్నాయి. రాజకీయాలలో ఒక మనిషికి ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాము. కానీ మనం సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషులందరికీ ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరిస్తున్నాము. ఎంతకాలం ఈ వైరుధ్యాల జీవితం. ఈ వైరుధ్యాలను వీలైనంత త్వరగా అంతం చేయాలి. లేదంటే రాజ్యాంగ సభవారు కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలకు గురైనవారు పెకలించి వేస్తారని చెప్పిన మాటలను మన పాలకులు గుర్తుంచుకోవాలి.

రెగ్యులరైజ్‌ చేయకుంటే ఛలోఅసెంబ్లీ..

'రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యుల రైజ్‌ చేయాలి. లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పక్షాలనూ కలుపుకొని చలో అసెంబ్లీ నిర్వహిస్తాం' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.రాష్ట్రంలో మూడు లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుంటే కేవలం మూడు వేలమందే ఉన్నారంటూ మంత్రి వర్గ ఉపసంఘం ప్రకటించడం దారుణ మన్నారు. వారినే రెగ్యులర్‌ చేస్తామనడం ఉద్యోగులను దగా చేయడమేనన్నారు. అంగన్‌వాడీల ఉద్యమాన్ని అణచివేయా లని చూస్తే మహిళలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు.

విభజనకోరుతూ టిడిపి లేఖరాసింది..

అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా 'రాజ్యాంగం-అంబేద్కర్‌'పై లోక్‌సభలో చేపట్టిన చర్చ గురువారం కొంత ఉద్రిక్తంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు రాజ్యాంగంలోని ఒక క్లాజు కారణమని, అందువల్లే విభజనకు వ్యతిరేకంగా ఉమ్మడి ఏపీ శాసనసభ తీర్మానం చేసి పంపినప్పటికీ నాటి యుపిఎ ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరించిందని టిడిపి ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. దీంతో సభలో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. రామ్మోహన్‌నాయుడు వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఆయన ప్రసంగాన్ని అడ్డగించారు.

దళితసమస్యలపైచర్చించాలి:CPM

అంబేద్కర్‌ పేరుతో ప్రభుత్వ మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పూనుకుందని, అది మరోమారు ప్రత్యేకంగా, పార్లమెంట్‌ సాక్షిగా రుజువైందని సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ పక్ష నేత సీతారాం ఏచూరి విమర్శించారు. మొదట్నుంచి సిపిఎం ఉహించినట్లే ప్రభుత్వ వైఖరి ఉందని వ్యాఖ్యానించారు. దళితులు, గిరిజనలు, వెనుబడిన వారి అభివృద్ధిపై ప్రభుత్వం, బిజెపి దృష్టి పెట్టడం లేదని, ఎంతసేపు వారి హిందూత్వ సిద్ధాంతాన్ని బలోపేతం చేసి, మతోన్మాద ఘర్షణలు పెంచాలనే దానిపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీ, ఓబిసిల అభివృద్ధిని సిపిఎం కోరుకుందని ఆ దిశగా చట్టాలు తీసుకురావాలని డిమాండు చేశారు. 

30న గిరిజన గర్జనకు బృందా:మధు

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకం ఆలోచనను వెంటనే విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. ఈనెల 30న సిపిఎం ఆఖిలభారత నాయకురాలు బృందాకరత్‌ బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ లో జరిగే గిరిజన గర్జనకు హాజరౌతున్నట్లు తెలిపారు. 

ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారు

గ్గయ్యపేటరూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు అమలు పరుస్తున్నారని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సోమోజు నాగమణి విమర్శించారు. ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ మండలంలోని షేర్‌మహమ్మద్‌పేట అడ్డరోడ్డులో  ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను  సిపిఎం డివిజన్‌ నాయకులు ఘంటా నాంచారయ్య ప్రారంభించారు. ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ జాన్‌పాషా ముగించారు. సిపిఎం డివిజన్‌ నాయకులు కాకనబోయిన లింగారావు, నాయకులు దంతాల వెంకటేశ్వర్లు, కోట రవికుమార్‌, రామకృష్ణ, షేక్‌ గౌస్‌మియా, ప్రణయ తేజ, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మోడీ కేవలంRSSప్రచారక్:ఐలయ్య

ఆవు రక్షణను రాజ్యాంగం నుంచి తొలగించాలని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య డిమాండ్‌ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఐసిఎస్‌ఎస్‌ఆర్‌ హాల్‌లో డెమోక్రటిక్‌ కల్చరల్‌ ఫోరం ఆధ్యర్యంలో బుధవారం 'హోలీ కౌ- పాలిటిక్స్‌' అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.వందల ఏండ్ల ఇస్లాం పాలనలో పంది మాంసం తిన్నారన్న నెపంతో ఎవరిపైనా దాడులు జరగలేదని, హత్యలు జరగలేదని వివరించారు. మాదిగలు, ఆదివాసీలకు ఆవు, గేదె మాంసమే ప్రధాన ఆహారమని చెప్పారు. బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత, వేదాలలో ఎక్కడా ఆవు మాంసం తినొద్దని లేదని తెలిపారు.

Pages

Subscribe to RSS - 2015