రెగ్యులరైజ్‌ చేయకుంటే ఛలోఅసెంబ్లీ..

'రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యుల రైజ్‌ చేయాలి. లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పక్షాలనూ కలుపుకొని చలో అసెంబ్లీ నిర్వహిస్తాం' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.రాష్ట్రంలో మూడు లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుంటే కేవలం మూడు వేలమందే ఉన్నారంటూ మంత్రి వర్గ ఉపసంఘం ప్రకటించడం దారుణ మన్నారు. వారినే రెగ్యులర్‌ చేస్తామనడం ఉద్యోగులను దగా చేయడమేనన్నారు. అంగన్‌వాడీల ఉద్యమాన్ని అణచివేయా లని చూస్తే మహిళలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ప్రకటించిన ప్రకారం వారి వేతనాలు పెంచుతూ జిఓ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రుణాలు దొరక్క, అప్పులు తీరక, గిట్టుబాటు ధరలు రాక రైతులు బలవన్మరణాలు చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో 40మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదని విమర్శిం చారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించా లని డిమాండ్‌ చేశారు.